Prabhas : పాన్ ఇండియా స్టార్‌గా మారినా కూడా ప్రభాస్ ప్రయోగాలు ఆపలేదు. ఎప్పుడూ ఒకే విధమైన సినిమాలు చేస్తుంటే తన ఫ్యాన్స్‌కు కూడా బోర్ కొట్టేస్తుందని.. అందుకే తను చేసే సినిమాలలో ఒక్కొక్కటి ఒక్కొక్క జోనర్ అని ఇదివరకే చెప్పుకొచ్చాడు ప్రభాస్. అయితే ఇటీవల ప్రభాస్ సాహో, రాధేశ్యామ్ ఫ్లాప్ అవ్వడంతో రాబోయే సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆదిపురుష్ విడుదలకు సిద్ధంగా ఉండగా..
సలార్, ప్రాజెక్ట్ K షూటింగ్ ముగింపు దశకు చేరుకున్నాయి. వీటితో పాటు దర్శకుడు మారుతి డైరెక్షన్‌లోనూ ప్రభాస్ రాజా డీలాక్స్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ సబ్జెక్ట్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. కాగా, ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈ సినిమాలో హార్రర్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ చెబుతుంది.
అంతేకాదు ప్రభాస్ ఒక డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నట్లు సమాచారం. త్వరలో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ చేయనున్నట్లు సమాచారం. మారుతి సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్.. మాస్‌గా ఉంటుందట. తొలిసారి ప్రభాస్ కెరీర్లో లుంగీతో ఫస్ట్ లుక్ డిజైన్ చేశారట. సినిమా పక్కా ఎంటర్టైనర్ అనే సంకేతాలను ఫస్ట్ లుక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇందులో ఒక కథానాయిక మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.