Prabhas Project K : టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్‌కి చేరుకున్న ప్రభాస్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. సెట్స్‌పై ఆయనవి భారీ చిత్రాలున్నాయంటే ఆయన ఏ రేంజ్‌లో జోరు చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చేస్తున్నాడు. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు మారుతీ డైరెక్షన్ రాజా డీలాక్స్ సైలెంట్ గా సెట్స్ పైకి వెళ్ళింది.
ఇవేకాక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘ప్రాజెక్ట్ K’ అనే ఫాంటసీ సైంటిఫిక్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ప్రభాస్ కు జోడీగా దీపికా పదుకొనేల నటిస్తుండగా దిశా పటాని లాంటి స్టార్ క్యాస్టింగ్ ఈ మూవీలో నటిస్తున్నారు. ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కి స్తున్నారు. ఇక మూవీలో ప్రభాస్ సూపర్ హీరో తరహా పాత్రలో కనిపిస్తాడని సమాచారం. ఇదిలావుంటే ఈ సినిమా బిజినెస్ డీల్స్ కూడా జరిగిపోతున్నాయని టాక్.
ప్రాజెక్ట్ K నైజాం రైట్స్ ని ఏకంగా 72 కోట్లు పెట్టి ఏసియన్ సునీల్ నారంగ్ సొంతం చేసుకున్నాడట. ఈ స్థాయిలో ఒక ఏరియా రైట్స్ అంటే ఆంధ్రాలో అంతకు మించి ఉండే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈ నైజాం ఏరియా రైట్స్ ద్వారా ప్రాజెక్ట్ K మూవీ వేల్యూ ఎంత అనేది అర్ధమైపోతోంది. వరల్డ్ వైడ్ గా సినిమా పై కనీసం 800 కోట్ల బిజినెస్ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఇండియాలోనే హైయెస్ట్ బిజినెస్ డీల్ జరిగే మూవీలో ప్రాజెక్ట్ K నిలుస్తుంది.