Pushpa is the Third Part of the Movie : పుష్ప తో అల్లు అర్జున్ ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడో మనకు తెలిసిందే.. ఇప్పుడు పుష్ప 2 తో మన ముందుకు రాబోతున్నారు. ఆ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే అభిమానులు ఎంతో ఆసక్తిగా పుష్ప 2 సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పుష్ప సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పటివరకు పుష్ప రెండు పార్ట్ లుగా మన ముందుకు రాబోతుందని తెలుసు.
కానీ పుష్ప సినిమాకు మూడో పార్ట్ కూడా ఉండబోతుందని ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది. పుష్ప సెకండ్ పార్ట్ కి “పుష్పా ది రూల్” అని టైటిల్ ని ఫిక్స్ చేయగా, ఇక మూడో పార్ట్ కి “పుష్పాది రోర్” అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ షాకింగ్ న్యూస్ తో ఫాన్స్ కాస్త గందరగోళానికి గురవుతున్నారు. ఈ వార్తలో నిజమెంతుందని చెప్పి తెలుసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. పుష్ప త్రికి ఇంకాస్త టైం పడుతుందని మరో వార్త.
కానీ ఈ విషయం పైన ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన మాత్రం రాలేదు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఫ్యాన్స్ పుష్ప కంక్లూజన్ కోసం ఇంకొన్ని రోజులు ఆగాల్సి వస్తుంది. పుష్ప ది రూల్ లోనే అల్లు అర్జున్ తన గెటప్ లతో మారుమోగించారు. ఒకవేళ పుష్ప 3 ఉంటే మాత్రం ఇంకా రచ్చ మామూలుగా ఉండదు. ఫ్యాన్స్ ఈ న్యూస్ తో ఖుషి అవుతున్నా కూడా, మరోవైపు పుష్ప 3 లో స్టోరీ ఏ విధంగా ఉంటుందని ఆసక్తిగా ఉన్నారు. చూద్దాం ఈ వార్తల్లో నిజం ఏంటో..