Rajanikanth – Nani : రజినీకాంత్.. ఈ పేరుకు ముందు సూపర్‌స్టార్ లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. ఆ పేరు ఆయన కోసమే పెట్టినట్లుగా సినీ, వ్యక్తిగత జీవితాలతో విశేష ప్రజాదరణ పొందారు. సూపర్‌స్టార్ రజినీకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్న విషయం తెలిసిందే. ప్రెసెంట్ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఓ మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘రోబో’ తర్వాత ఇప్పటివరకు రజనీకు సరైన హిట్టు లేదు. మధ్యలో ‘పేట’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న, కమర్షియల్‌గా భారీ విజయం సాధించలేక పోయింది.
జైలర్ మూవీతో ఆగస్ట్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రజనీకాంత్. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై ఫ్యాన్స్ ఆశలు, రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ సినిమాతో రజనీకాంత్ కు బ్లాక్ బస్టర్ అందిస్తారని భావిస్తున్నారు. నెక్స్ట్ అయితే తలైవర్ “జై భీమ్” దర్శకుడు టి జే జ్ఞ్యానవేల్ ముత్తు తో ఓ సాలిడ్ సబ్జెక్టు ని చేయబోతున్న సంగతి తెలిసిందే.
Pawan Kalyan Watch Cost : బ్రో ఈవెంట్ లో పవన్ ధరించిన వాచ్ ధరెంతో తెలుసా..!?
అయితే ఈ చిత్రం కూడా పలు నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుండగా.. ఈ చిత్రంలో నేచురల్ స్టార్ నాని కూడా కనిపిస్తాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే నాని అందులో ఓ ముఖ్య పాత్ర కోసం సంపరందించారట. మరి ఈ క్రేజీ టాక్ ఎంతవరకు నిజం అనేది త్వరలో తెలుస్తుంది. ఇక నాని ఇటీవల దసరాతో 100కోట్ల క్లబ్ లో చేరి.. డబుల్ ఉత్సాహంలో ఉన్నాడు. ప్రస్తుతం తన నెక్స్ట్ తన కెరీర్ 30వ చిత్రం “హాయ్ నాన్న” లో ఇప్పుడు బిజీగా ఉన్నాడు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేస్తుంది.