Ram Charan Directed by Sanjay Leela Bhansali : సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త ట్రెండ్ నడుస్తుంది. ఎటు చూసినా పాన్ ఇండియా సినిమా, పాన్ ఇండియా హీరో అంటూ ఒక నయా పోకడ ప్రేక్షకులకు కూడా అలవాటు అయిపోయింది. ఇక్కడ రామ్ చరణ్ మరోమారు పాన్ ఇండియా స్టార్ కాబోతున్నాడు. వివరాల్లోకి వెళితే…
ఇప్పటికే RRR మూవీతో రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమాలో నటించి ఒక స్టార్ గా వెలుగు వెలిగాడు. ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో రాబోతున్న గేమ్ ఛేంజర్ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో రాబోతుంది. ఈ సినిమా అయిపోగానే రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో మరో సినిమాలో నటించబోతున్నాడు. ఆ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది.
అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఇచ్చిన కమిట్మెంట్ మరో ఎత్తు లాగా ఉంది. రాంచరణ్ సంజయ్ లీలా భన్సాలి దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నాడు అనే వార్త నెట్ ఇంట్లో హల్చల్ చేస్తుంది. ఇప్పటికే ఈ వార్త రామ్ చరణ్ ఫ్యాన్స్ ఖుషి చేస్తుంది. చరణ్ ఆ సినిమాలో మల్టీ స్టార్ పాత్రన, లేకపోతే ఒక్కడే నటించే సోలో పాత్రనా..? అనేది మాత్రం క్లారిటీ రాలేదు.
ఇప్పటికే ఎన్టీఆర్ మాత్రం బాలీవుడ్ లో మల్టీ స్టార్ గా ఒక సినిమాకు కమిటీ అయ్యాడు. రామ్ చరణ్ కూడా ఆ దారిలోనే నడుస్తాడా, లేకపోతే సోలోగా సినిమా చేయబోతున్నాడా, అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ రకంగా సినిమాలు ఒప్పుకుంటే మాత్రం మన వాళ్లు ఊహించని విధంగా మరో రేంజ్ లో ఒక వెలుగు వెలిగి పోతారు. ఇప్పటికే సంజయ్ లీలా బన్సాలితో సినిమా అంటే మామూలు విషయం కాదని అందరూ కామెంట్ చేస్తున్నారు.
రామ్ చరణ్ రెండు సంవత్సరాల ముందుగానే ఈ సినిమాకి కమిట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇలా ముందుగా సినిమాలకు కమిట్ అవడం కూడా ఒక ట్రెండ్ గా మారిపోయింది. రామ్ చరణ్ ఇలాంటి సినిమాలు ఎన్నో చేసి ఇంకా మంచి గుర్తింపు తెచ్చుకోవాలి.