Ram Charan Game Changer Release : ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో భారీ చిత్రంలో నటిస్తున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తోండగా.. ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. డైరెక్టర్ శంకర్ తన ప్రతి మూవీలో సామాజిక అంశాలను కూడా ప్రస్తావిస్తాడు గేమ్ ఛేంజర్ లో కూడా తన స్టైల్ కి తగ్గట్టే ప్లాన్ చేసాడు. ఆ మధ్య షూటింగ్ కి గ్యాప్ ఇచ్చిన మేకర్స్,
తాజా షెడ్యూల్ ని మైసూర్ లో జూన్ 4 నుంచి 11 లేదా 12 వరకు షూట్ ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టైటిల్, ఫస్ట్ లుక్ హైప్ పెంచగా.. మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, మూవీ నుండి గ్లింప్స్, టీజర్, సాంగ్స్, వంటి అప్ డేట్స్ ఎప్పుడు వస్తాయి అనే క్లారిటీ లేదు. అయితే డైరెక్టర్ శంకర్ గేమ్ ఛేంజర్ తో పాటు ఇండియన్ 2 మూవీ కూడా చేస్తున్నాడు. అయితే ఇండియన్ 2 మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా
రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో గేమ్ ఛేంజర్ సమ్మర్ లో రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది. చరణ్ మూవీ కంటే ముందే ఇండియన్ 2 రిలీజ్ చేయాలని డైరెక్టర్ శంకర్ తో పాటు మూవీ టీం కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చరణ్ గేమ్ ఛేంజర్ కమల్ హాసన్ ఇండియన్ 2 రిలీజ్ పై ఆధారపడి ఉందని అర్థమవుతుంది. ఏదేమైనా గేమ్ ఛేంజర్ రిలీజ్ పై మేకర్స్ ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.