Ram Charan Game Changer : RRR బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ అయిపోయిన మెగా పవర్ స్టార్ రామ్. ప్రెసెంట్ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో భారీ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కి కొంత గ్యాప్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తోండగా.. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
డైరెక్టర్ శంకర్ తన ప్రతి మూవీలో సామాజిక అంశాలను కూడా ప్రస్తావిస్తాడు గేమ్ ఛేంజర్ లో కూడా తన స్టైల్ కి తగ్గట్టే ప్లాన్ చేసాడు. అయితే గేమ్ ఛేంజర్ మూవీకి శంకర్ అండ్ టీం గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అలాగే ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీ టార్గెట్ పెద్దగానే పెట్టుకున్నట్టు తెలుస్తుంది. RRR మూవీ 1000 కోట్ల పైగా వసూళ్లను రాబట్టడంతో చరణ్ కి ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ తో గేమ్ చేంజర్ ని కూడా 1000 కోట్ల క్లబ్ లో చేర్చాలని చూస్తున్నారు మేకర్స్.
అందుకు తగ్గట్టుగానే భారీగా రిలీజ్ ప్లాన్ చెడుతున్నారట. శంకర్ గేమ్ ఛేంజర్ పై దిల్ రాజు పూర్తి నమ్మకంతో ఉన్నాడట. చరణ్ మ్యాజిక్ చేస్తాడని కాన్ఫిడెంట్ గా ఉన్నాడట దిల్ రాజు. ముందు నుంచే రిలీజ్ కి మంచి స్కెచ్ వేస్తున్నారట దర్శక, నిర్మాతలు. మూవీకి హిట్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం. ఈ మూవీ రిలీజ్ కోసం మంచి డేట్ కోసం చూస్తున్నారు మేకర్స్. గేమ్ ఛేంజర్ తో చరణ్ బాక్సాఫీస్ వద్ద పంజా విసురుతాడో లేదో చూడాలి..