Ram Pothineni Boyapati : బాక్సాఫీస్ ఊచకోతకు బోయపాటి స్కంద రెడీ..
రామ్ పోతినేని.. దేవదాసు మూవీతో చిన్న వయసులోనే ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు ఈ యంగ్ హీరో.. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం రామ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాడు. మాస్ థండర్ అంటూ టీజర్ తోనే సినిమా ఎలా ఉండబోతోందో చూపించారు దర్శకుడు బోయపాటి శ్రీను.
రామ్ ఎనర్జీకి తగ్గట్టుగా తన తన మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఆయన దీన్ని తెరకెక్కిస్తున్నారు. జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. అయితే RAPO అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ తెరకెక్కగా.. తాజాగా ఈ మూవీ టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీకి స్కంద అనే టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లిమ్స్ లో బోయపాటి మాస్ మార్క్ మరోసారి కనిపించింది.
వరుస సినిమాలతో శ్రీ లీల బిజీ బిజీ..
రామ్ కు జోడిగా యంగ్ బ్యూటీ శ్రీలీల..
ఇందులో రామ్ కు జోడిగా యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుండగా.. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దసరాకు రావాల్సిన ఈ మూవీ నెల రోజుల ముందుగా వినాయక చవితికి సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ రిజల్ట్ ఏవిధంగా ఉంటుందో మరికొన్ని రోజుల్లో తేలిపోతుంది.