Ravi Teja and Gopichand Malineni : డాన్ శీను, బలుపు, క్రాక్.. ఇలా వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించి టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో ఒకటిగా నిలిచారు. రవితేజ మరియు గోపీచంద్ మలినేని. అయితే ఈ కాంబో మరోసారి జతకట్టనుంది. మాస్ మహారాజ్ కోసం గోపిచంద్ మలినేని మరో కమర్షియల్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేసుకున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించనుంది. హీరోయిన్ ఇతర టెక్నిషియన్స్ ఇంకా కంఫర్మ్ కాలేదు.
ఈ కాంబోకి సంబంధించి అఫిషియల్ అనౌన్స్మెంట్ త్వరలో రానుంది. ప్రెసెంట్ రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. టైగర్ నాగేశ్వరరావు షూటింగ్ ముగింపు దశకు రాగా.. ఈగల్ మూవీ పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయ్యాక గోపీచంద్ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఈలోగా గోపిచంద్ మరో మూవీ కంప్లీట్ చేస్తాడా.. వెయిట్ చేస్తాడో చూడాలి. వీరి కాంబోలో మరో మూవీ వస్తే హిట్ పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు.