RaviTeja : వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉన్న మాస్ మహారాజ్.. కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ చేతిలో టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ అనే రెండు పాన్ ఇండియా చిత్రాలు ఉండగా మరో కొత్త ప్రాజెక్ట్ లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఆ సినిమాకు డైరెక్టర్ మరెవరో కాదు జాతిరత్నాలు ఫేమ్ యంగ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ. అనుదీప్ చేసినవి 3 సినిమాలే (పిట్టగోడ, జాతిరత్నాలు, ప్రిన్స్) అయినా తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. పైగా అనుదీప్ కామెడీ క్లీన్ గా ఉండడం మరో విశేషం.
రవితేజ, అనుదీప్ కాంబోలో మూవీ వస్తే మాత్రం వింటేజ్ రవితేజను చూడొచ్చు. అనుదీప్ కామెడీ టైమింగ్ కి పర్ఫెక్ట్ గా మాస్ మహారాజ్ టైమింగ్ సింక్ అయ్యిందంటే మాత్రం ఓ రేంజ్ లో ఫన్ రైడ్ ఉంటుంది. కామెడీ డ్రామాగా హైదరాబాద్, ఢిల్లీ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. సో ఈ ప్రాజెక్ట్ కి దిల్ రాజు ప్రొడ్యూసర్ కాగా తమన్నాని కానీ త్రిషని కానీ హీరోయిన్ గా సెలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. త్వరలో అఫిషియల్ గా ఈ మూవీ అనౌన్స్మెంట్ రానుంది.