Sai Dharam Tej : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా టాలీవుడ్ లో రాణిస్తున్న విషయం తెలిసిందే. పిల్లా నువ్వులేని జీవితం అనే సినిమాతో హీరోగా పరిచయమైన ఈ యంగ్ హీరో. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుపోతున్నాడు. రీసెంట్ గా విరూపాక్ష అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు 100కోట్ల క్లబ్ లో చేరాడు తేజ్. ప్రస్తుతం ఈ సుప్రీం హీరో మేనమామ పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో మూవీలో నటిస్తున్నాడు.
ఈ మూవీకి సముద్రఖని డైరెక్టర్ తో పాటు ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. జులై 28న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తర్వాత తేజ్ క్రేజీ లైనప్ సెట్ చేసుకున్నాడు. యంగ్ డైరెక్టర్ జయంత్ తో ఒక మూవీ చేయనున్న సాయి తేజ్, దానితో పాటు సంపత్ నందితో కూడా మరొక మూవీకి కమిట్ అయినట్లు తెలుస్తోంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ మూవీని నిర్మించనుండగా.. దీనికి గాంజా శంకర్ అనే పవర్ఫుల్ టైటిల్ ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల గోపిచంద్ సీటిమార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంపత్ నంది, మెగా హీరో కోసం పవర్ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశాడట. త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన రానుంది.