Sai Dharam Tej : ఆది, చెన్న కేశవ రెడ్డి, దిల్ , ఠాగూర్ వంటి బాక్ బస్టర్స్ తీసిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వీ వీ వినాయక్. ఈ మధ్య వినాయక్ డైరెక్షన్ లో చెప్పుకోదగ్గ సినిమాలు కూడా ఏం రాలేదు. ఆ మధ్య విడుదలైన ఖైదీ 150 హిట్ అయినా, ఇంటిల్లిజెంట్ అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ తో ప్రభాస్ ఛత్రపతి హిందీలో రీమేక్ చేస్తున్నారు. అయితే విరూపాక్ష బ్లాక్ బస్టర్ తర్వాత ఫుల్ ఫామ్ లోకి వచ్చిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ రెండు, మూడు సినిమాల ప్లానింగ్ లో ఉన్నాడు.
అందులో ఒకటి సంపత్ నంది డైరెక్షన్ లో ఉండగా.. రెండోది వినాయక్ డైరెక్షన్ లో మరో సినిమా చేయనున్నట్టు సమాచారం. అయితే సాయి ధరమ్ తేజ్ తో ఇంతకు ముందు ఇంటిలిజెంట్ మూవీని తీసి ఫ్లాప్ ఇచ్చిన వినాయక్ మరోసారి అతనితో సినిమాకు సిద్ధం అయ్యాడు. ఈ మూవీ కథ క్రైం థ్రిల్లర్ గా ఉండబోతుందని సమాచారం. సాయి ధరమ్ తేజ్ వినాయక్ కాంబో ఈసారైనా హిట్ కొడతారేమో చూడాలి.