Sai Dharam Tej : మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా టాలీవుడ్ లో రాణిస్తున్న విషయం తెలిసిందే. పిల్లా నువ్వులేని జీవితం అనే సినిమాతో హీరోగా పరిచయమైన ఈ యంగ్ హీరో. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుపోతున్నాడు. ఏడాది విరూపాక్షతో బిగ్గెట్స్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో ఫస్ట్ టైం 100కోట్ల క్లబ్ లో చేరాడు. ఇక సాయిధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ కలిసి నటించిన బ్రో ది అవతార్ ఈ నెల 28న విడుదల కానుంది.

ప్రస్తుతం బ్రో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న తేజ్ ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. BRO ది అవతార్ తర్వాత సంపత్ నందితో ఒక ప్రాజెక్ట్ చెయ్యబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టే ముందు ఆరు నెలలు సినిమాలకి, షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నాడట, తన శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి ఆరు నెలల విరామం తీసుకుంటానని తెలిపాడు తేజ్. ఇకపై చెయ్యబోయే సినిమాల కోసం తన 100 శాతం బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నట్లుగా చెప్పిన సాయి ధరమ్ తేజ్.. ప్రేక్షకుల నుండి తనపై ఎటువంటి ఫిర్యాదులు ఉండకూడదు.
Vijay Sethupathi : ఆ మూవీకి రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినా నటించేవాడిని..
చిన్న సర్జరీ చేయించుకోవాలి, ఆ తర్వాత నేను బలంగా తిరిగి వస్తానన్నాడు. తన ఆరోగ్యంపై దృష్టి సారించే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని, అభిమానులు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు మెగా మేనల్లుడు తెలిపాడు. కాగా బైక్ ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని నెలల పాటు సినిమాలకు దూరమయ్యాడీ మెగా హీరో. ఇటీవల సమంత కూడా తన ఆరోగ్య దృష్ట్యా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Pawan Kalyan in SP Office : రాజ్యాంగ హక్కులను కాలరాయడం పోలీసులకు తగదు : పవన్ కళ్యాణ్