Salaar Teaser : ఆదిపురుష్ డిజాస్టర్ తర్వాత ప్యాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు సలార్ చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నాడు. కేజీఎఫ్ చిత్రాలతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఈ మూవీని సెప్టెంబర్ 28వ తేదీన విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ పై దృష్టి పెట్టారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ అప్డేట్ ఇచ్చారు. జులై 6న ఉదయం5:12 సలార్ టీజర్ రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ టీజర్ డ్యూరేషన్ 90 సెకండ్స్ గా ఫిక్స్ చేశారని సమాచారం.
ఈ 90 సెకెండ్లలోనే.. సలార్ గా ప్రభాస్ మాస్ భీబత్సం సృష్టించనున్నాడట. టీజర్ మొత్తం హై విల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో, గూస్ బంప్స్ తెప్పించేలా డిజైన్ చేశాడట ప్రశాంత్. ప్రభాస్ లుక్స్, డైలాగ్స్ నెక్స్ట్ లెవల్లో ఉండనున్నాయట. కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకొని ఈ టీజర్ ను కట్ చేశారట మేకర్స్. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా శృతీ హాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే.