Salaar Update : రెబల్ స్టార్ ప్రభాస్ హిట్లూ, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు. ఇటీవల ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ 450కోట్లు కలెక్ట్ చేసింది. అయితే ఆదిపురుష్ ఫ్యాన్స్ ని కొంత నిరుత్సాహ పరచడంతో అంతా సెన్సేషనల్ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న సలార్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా సలార్ తెరకెక్కించగా ఈ సినిమా నుంచి అవైటెడ్ టీజర్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
జూలై మొదటి వారంలో రిలీజ్ చేస్తున్నట్టుగా సాలిడ్ బజ్ ఆల్రెడీ ఉంది. ఇక ఈ టీజర్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే.. టీజర్ కి ప్రెసెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మిక్సింగ్ పనులు జరుగుతున్నాయట. ఈ మూవీకి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా మీనాక్షీ చౌదరి, పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబళే ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
