Salaar Update : బాహుబలి తర్వాత వరుసగా పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు రెబల్ స్టార్. ఈ క్రమంలో సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ మూవీస్ కు కమిట్ అయ్యాడు ప్రభాస్. కానీ ఈ టైములో ప్రభాస్ నుంచి మంచి మాస్ మూవీ వస్తే.. అది బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సలార్ అదే స్థాయిలో ఉంటుందని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు. రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ప్రభాస్ సరసన శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మూవీని వరల్డ్ వైడ్ గా ఈఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ మూవీ క్లైమాక్స్ కి గట్టిగానే సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్లైమాక్స్ లో దాదాపు 400 మంది పాల్గొంటారని సమాచారం. దీన్నిబట్టి క్లైమాక్స్ ను ఏ రేంజ్ లో చూపించనున్నారనేది అర్థం చేసుకోవచ్చు. ఇంచుమించు ‘కేజీఎఫ్’ స్థాయిలో క్లైమాక్స్ ఉంటుంది.
ఈ ఎపిసోడ్ ఈ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందనీ, భారీతనానికి అద్దం పడుతుందని అంటున్నారు. ఇంతవరకూ ప్రభాస్ చేసిన యాక్షన్ సీన్స్ లో ఇదే బెస్ట్ అవ్వనుందని టాక్. ఈ మూవీలో మీనాక్షీ చౌదరి, జగపతిబాబు తదితరులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ K తో పాటు, సందీప్ వంగ దర్శకత్వంలో స్పిరిట్, మారుతీ డైరెక్షన్ రాజా డీలాక్స్ మూవీ చేస్తున్నాడు.