Samajavaragamana OTT : టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు.. ఒక పక్క వైవిధ్యమైన సినిమాలు చేస్తూనే, మరోపక్క ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్స్ లో కూడా నటిస్తూ మంచి గుర్తింపుని సందించుకున్నాడు. తాజాగా ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ‘సామజవరగమన’. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌తో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కొన్ని డబుల్ మీనింగ్స్ డైలాగులు మినహా మొత్తం మీద ఇటువంటి క్లీన్ కామెడీ ఫిల్మ్ తీయడం కత్తి మీద సాము అని చెప్పాలి.
ఇందులో బాలు పాత్రలో శ్రీవిష్ణు జీవించారు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ సూపర్. రూ.7 కోట్లతో తీసిన సినిమా మంచి భారీగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది. US లో 25 లక్షలకు కొంటే.. గ్రాస్ 8 కోట్లు, షేర్ 4కోట్లు కలెక్ట్ చేసింది. థియేటర్ లో కడుపుబ్బా నవ్విస్తున్న ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఇక ఈ సినిమాను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా లో స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం.
Trivikram Bro Remuneration : బ్రో మూవీకి త్రివిక్రమ్ షాకింగ్ రెమ్యునరేషన్..
ఈ చితాన్ని ఈ నెల 22 లేదా 25 నుంచి ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్స్ లో జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల పేక్షకులను ఆకట్టుకుంది. ఓటీటీలో ఈ మూవీ చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.