Trivikram Bro Remuneration : పంచ్ లు, ప్రాస, జీవిత సత్యాలతో ప్రేక్షకులను ఆకర్షిస్తాడు డైరెక్టర్ త్రివిక్రమ్. తెలుగు రచయితల స్థాయిని పెంచిన వాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. దర్శకుడు విజయ భాస్కర్ వద్ద డైలాగ్ రైటర్ గా స్వయం వరం, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చవ్ వంటి సినిమాలకు అద్భుతమైన డైలాగులు రాసి బెస్ట్ డైలాగ్ రైటర్ అవార్డులు కూడా గెల్చుకున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ గా చేస్తూ ఇండస్ట్రీ హిట్లు అందుకుంటున్నాడు త్రివిక్రముడు. అయితే ఈ మధ్య డైరెక్షన్ తో పాటుగా రీమేక్ సినిమాలకు కథనం మాటలు కూడా అందిస్తున్నాడు.

ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న రీమేక్ సినిమాలకు త్రివిక్రమ్ అన్ని పనులు దగ్గరుండీ చూసుకుంటాడు. ఇక పవన్, త్రివిక్రమ్ అండర్ స్టాండింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. త్రివిక్రమ్ ఫలానా మూవీ పవన్ కు సూట్ అవ్వుద్ది అంటేనే చేస్తాడని టాక్. పవన్ లాస్ట్ హిట్ మూవీ భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర అయినప్పటికీ మళ్లీ రీ షూట్లు చేసి సినిమా నడిపించింది మాత్రం త్రివిక్రమే.
Game Changer : మారిన గేమ్ ఛేంజర్ డైరెక్టర్..
అయితే ప్రెసెంట్ రిలీజ్ కి సిద్ధంగా ఉన్న పవన్ బ్రో మూవీకి సముద్రఖని డైరెక్టర్ కాగా మాటలు, స్క్రీన్ ప్లే త్రివిక్రమ్. ‘బ్రో’కి త్రివిక్రమ్ వర్క్ ఎంత అనేది మూవీ వచ్చాక తెలుస్తుంది. అయితే ఈ మూవీకి త్రివిక్రమ్ భారీ రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తుంది. బ్రో మూవీకి త్రివిక్రమ్ 15 కోట్ల దాకా పారితోషికం తీసుకున్నాడని సమాచారం. ఈ సినిమాలో పవన్ తో పాటుగా మేనల్లుడు సాయి తేజ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. జూలై 28న రిలీజ్ అవుతున్న బ్రో అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.