Samantha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్పలో సాంగ్స్ ఎంత హిట్టయ్యాయో అందరి తెలిసిందే. దేవీ శ్రీ ప్రసాద్, అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ అంటే చాలు.. కచ్చితంగా ఆ మూవీలో ఐటం సాంగ్ ఉంటుంది. మొదటి సినిమా ఆర్య నుంచి సుక్కు ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఇక లేటెస్ట్ మూవీ పుష్పలో.. ‘ఊ ఉంటావా.. ఊ ఊ అంటావా మావ అంటూ తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేసింది.
స్టార్ హీరోయిన్ సమంత మొదటిసారిగా ఓ ఐటమ్ సాంగ్ చేయడం విశేషం. చంద్రబోస్ దీనికి లిరిక్స్ అందించగా, ఇంద్రావతి ఆలపించారు. సాంగ్ రిలీజ్ అయినా కొన్ని గంటల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇప్పటికీ ఏ పార్టీ జరిగినా, ఫంక్షన్ జరిగినా ఊ అంటావా మావ.. పాట మార్మోగుతూనే ఉంటుంది. సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా ట్రెండ్ అయిన ఈ సామ్ సాంగ్ ఎంతలా పాపులరయ్యిందో.. దీనికి పేరడిగా వచ్చిన పాటలు కూడా సోషల్ మీడియాను షేక్ చేశాయి.
Also Read: శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం ఎన్ని ముఖాలు ఉంటాయి?
అయితే తాజాగా ఈ సాంగ్ మరో రికార్డ్ ని సొంతం చేసుకుంది. ఈ సాంగ్ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సమంత తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేయగా అది 100 మిలియన్ వ్యూస్ దాటింది. ఈ విషయాన్ని Samantha Shaakuntalam ట్వీట్ చేయగా సామ్ దాన్ని రీట్వీట్ చేసింది. సామ్ రీట్వీట్ తో ఈ వీడియో మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతుంది.
— Samantha (@Samanthaprabhu2) February 9, 2023
Discussion about this post