Samantha : హీరోయిన్ సమంతతో లేడి డైరెక్టర్ నందినిరెడ్డికి చక్కటి స్నేహం ఉంది. కష్టసమయాల్లో తనకు అండగా నిలిచిన సన్నిహితుల్లో నందినిరెడ్డి ఒకరు అని సమంత పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో జబర్ధస్త్‌తో పాటు ఓ బేబీ సినిమాలొచ్చాయి. వాటిలో జబర్ధస్థ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టగా ఓ బేబీ మాత్రం కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో సమంత నటనకు ప్రశంసలు దక్కాయి. అయితే తాజాగా సమంత, నందినిరెడ్డి కాంబినేషన్లో
హ్యాట్రిక్ మూవీ రాబోతున్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. ఇందులో DJ టిల్లు ఫేమ్ సిద్దూ జొన్నలగడ్డ హీరో. అయితే.. ఈ సినిమా సమంత చేస్తుందా? లేదా? అనేది అనుమానంగా మారింది. నందిని రెడ్డి సినిమాకి తన డేట్లు సర్దుబాటు కావడం లేదని సమంత చెబుతోందట. సమంత కోసం నందిని రెడ్డి కొంత కాలం ఆగుతుందా? లేదంటే.. మరో హీరోయిన్‌తో ప్రొసీడ్ అవుతుందా లేదా సామ్ ని ఒప్పిస్తారా అనేది తేలాల్సివుంది.
ఇటీవల నందిని రెడ్డి నుంచి వచ్చిన అన్నీ మంచి శకునములే మూవీ డిజాస్టర్ అవడంతో ఈ సారి స్క్రిప్ట్ విషయంలో మరింత ఫోకస్ పెట్టిందని టాక్. ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండతో ఖుషితో, వరుణ్ ధావన్ తో సిటాడేల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. మరోవైపు సిద్దు DJ టిల్లు2 తో పాటు చిరంజీవి మూవీలో నటించనున్నట్టు సమాచారం. సామ్, సిద్దు కాంబో సెట్ అవుతుందో లేదో తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.