Sandeep Reddy Vanga Comments about Rashmika : రష్మిక మందన్న ఉత్తమ నటిగా ఎంపిక కాకపోవడానికి అసలు కారణాలు చాలా ఉన్నాయి. ఈ విషయం పట్ల సందీప్ రెడ్డివంగా ఆచ్చర్యాన్ని వ్యక్తం చేసిన కూడా, ప్రేక్షకులు మాత్రం చాలా లైట్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇటీవల జరిగిన “ఫిలింఫేర్ అవార్డ్స్ 2024” లో ఈ చిత్రానికి ఐదు అవార్డులు వచ్చాయి. ఈ సినిమాను చూసుకుంటే అత్యంత హింసాత్మకంగా కూడుకొని ఉంది. అలాగే స్త్రీని ద్వేషించడం, అసభ్యకరమైన సన్నివేశాలు కూడా అధికంగానే ఉన్నాయి.
అయినప్పటికీ ఈ సినిమా 900 కోట్లు వసూలు చేసి అత్యంత భారీ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న పాత్ర కూడా ప్రముఖమైనదని చెప్పవచ్చు. కానీ రణబీర్ కపూర్ కి ఉత్తమ నటుడుగా అవార్డు ప్రకటించిన ఫిలింఫైర్ రష్మికను కనీసం నామినేటెడ్ కూడా చేయలేదు. ఈ విషయంలోనే సందీప్ రెడ్డివంగా కొంత వివరణ ఇచ్చారు.
సాధారణంగా కొన్ని ఎమోషన్స్ ని మనం ప్రజెంట్ చేసేటప్పుడు దానికి తగ్గట్టుగా మన హావభావాలను పలికించాల్సి ఉంటుంది. రష్మిక, రణబీర్ తో కొన్ని ఎమోషనల్ సీన్స్ లలో పండ్లు బిగించి మాట్లాడవలసి వచ్చింది. ఆ టైంలో అది కరెక్టుగా సెట్ అయ్యే నటన. కానీ ప్రేక్షకులు దాన్ని కాస్త జీర్ణించుకోలేకపోయారు. వాస్తవానికి ట్రైలర్ ని రిలీజ్ చేసినప్పుడు అది మనకు అంత పెద్దగా అర్థం కాదు. కానీ పెద్ద స్క్రీన్ మీద చూసినప్పుడు మాత్రం ఆ సీన్ కి ఆనటననే సమంజసంగా ఉంటుందని వివరించారు.
ఎమోషన్ సీన్స్ లలో రష్మిక మందన నటన అంత ఆసక్తిగా లేదని ప్రేక్షకులు ఒక నెగిటివ్ ప్రచారాన్ని కూడా రేకెత్తించారు. రష్మిక మందన నామినేటెడ్ కూడా కాకపోవడం కాస్తంత బాధ కలిగించే అంశమే అని సందీప్ రెడ్డి వంగ అన్నారు.