Shankar Gave an Update about the movie Game Changer : న్యూ ఇయర్ సందర్భంగా గేమ్ ఛేంజర్ టీం నుంచి ఒక క్రేజీ అప్డేట్ మన ముందుకు వచ్చింది. ఇప్పటికే రామ్ చరణ్ మూవీ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఒక ఖుషి ఖుషీ న్యూస్ ని అనౌన్స్ చేశారు శంకర్. న్యూ ఇయర్ కానుకగా గేమ్ ఛేంజర్ నుంచి ఏదో ఒక అప్డేట్ నిన్ననే వస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూశారు.
కానీ ఎటువంటి అప్డేట్ ని ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ కాస్త ఫీలైనట్టే అనిపించింది. కానీ ఈరోజు మంచి క్రేజీ అప్డేట్ ని శంకర్, ఫ్యాన్స్ కోసం రిలీవ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. శంకర్ ఇప్పటికే ఇండియన్ 2 సినిమా పై ఫోకస్ చేయడం వల్ల గేమ్ ఛేంజర్ షూటింగ్ లో కాస్త జాప్యం జరుగుతుందనే విషయం అర్థమవుతుంది. అయితే ఇప్పటికే రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ విషయంపై చాలా గరంగరంగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో శంకర్ జనవరి 17 నుంచి గేమ్ ఛేంజర్ కొత్త షెడ్యూల్ మొదలు కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ చాలా ఖుషి అయ్యారు. డిసెంబర్ చివరి వారంలో బాచుపల్లి లో మూడు రోజులపాటు షూట్ జరిగింది. ఆ తర్వాత ఈ టీం అందరూ బ్రేక్ తీసుకున్నారు. ఇక జనవరి 17 నుంచి రెండో షెడ్యూల్ స్టార్ట్ అవ్వనున్నట్లు ఈ షెడ్యూల్లో రామ్ చరణ్, కీయరా మీద ఒక రొమాంటిక్ సాంగ్ ని డైరెక్ట్ చేయనున్నట్లు శంకర్ తెలిపారు.
ఇండియన్ 2 షూట్ చివరి దశకు వచ్చేసింది. ఇక రామ్ చరణ్ తో షూట్ ఇంకా శరవేగంగా సాగిపోతుందని ఫాన్స్ అనుకుంటున్నారు. కానీ ఈ మధ్యలోనే మరో పెద్ద చిక్కును తీసుకొచ్చాడు శంకర్. ఇండియన్ 2 తర్వాత ఇండియన్ 3 షూటింగ్ కూడా ఉంటుందని ఆయన చెప్పారు. చూడాలి..చరణ్ మూవీ మాన్క్ ముందుకు రావడానికి 2024వ సంవత్సరంలోనే సెప్టెంబర్ వరకు ఆగాల్సిందేనేమో..