Sidhu Jonnalagadda New Movie Jack : సిద్దు జొన్నలగడ్డ ఒక సినిమాతోనే బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. Dj టిల్లు తో ఇప్పటికే ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాడు. ఇక త్వరలోనే డీజే టిల్లు సిక్వెల్ కూడా రాబోతుంది. డిజె టిల్లు సీక్వెల్ పూర్తయ్యేంతవరకు ఏ సినిమాను ఒప్పుకోకూడదని కమిట్ అయ్యాడు అంట,. ఇప్పుడు రీసెంట్ గా డీజె టిల్లు సీక్వెల్ పూర్తి కావడంతో అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పైన పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టారని తెలుస్తుంది.
రీసెంట్ గా బొమ్మరిల్లు భాస్కర్ నిర్వహణలో సిద్దు హీరోగా ఒక సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పైన BVSN ప్రసాదు నిర్మిస్తున్నారు. ఈ సినిమా SVCC 37 అనే వర్కింగ్ టైటిల్ తో నడుస్తుంది. ఈ సినిమాకి సంబంధించి క్రేజీ అప్డేట్ ని ఒకటి రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.
బుధవారం సిద్దు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా ఆ మూవీకి సంబంధించిన పోస్టర్ నీ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకి “జాక్” అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తున్నట్టుగా మేకర్స్ తెలిపారు. అయితే ఇప్పుడు ఈ జాక్ పోస్టర్ చాలా హాల్ చల్ సృష్టిస్తుంది. పోస్టర్ చూసిన అందరూ కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. ఆ పోస్టర్ లో సిద్దు రెండు చేతులలో గన్స్ పట్టుకొని ఉన్నాడు. అది చూసినప్పటి నుంచి అందరిలో క్యూరియాసిటీ మొదలైంది. ఆ పోస్టర్ చూస్తే సిద్దు ఈ సినిమాలో ఫుల్ యాక్షన్ రోల్ లో నటించినట్టుగా తెలుస్తుంది.
ఈ పోస్టర్ లో సిద్ధూ ఒక చేతిలో రియల్ గాన్ పట్టుకోగా, మరో చేతిలో బొమ్మ తుపాకిని పట్టుకుని కనిపిస్తున్నారు. అంటే దాని అర్థం ఈ సినిమా యాక్షన్ అండ్ కామెడీగా ఉండబోతుందని అందరూ గెస్ చేస్తున్నారు. అలాగే సిద్దు ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారని ఇంకొక టాక్ కూడా నడుస్తుంది. జాక్ అనే టైటిల్ కింద క్రాక్ అని రాసి ఉండడం ఇంకా క్యూరియాసిటీని పెంచుతుంది.
బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో సిద్దు కొత్తగా కనిపించబోతున్నాడు అనడానికి జాక్ పోస్టర్ నిదర్శనం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బేబీ సినిమాతో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్న వైష్ణవి నటిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉందంట, ఆ పాత్రకి వైష్ణవి అయితేనే సరిగ్గా కుదురుతుందని తనని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంత క్రేజీ, క్రేజీగా అప్డేట్స్ తో ఉన్న ఈ మూవీ తొందరగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించాలని కోరుకుందాం..