SS Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో వచ్చిన ఈగ చిన్న సినిమాగా వచ్చి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. రాజమౌళి కెరీర్లో ‘ఈగ’కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ మూవీ జక్కన్న క్రియేటివిటీ కి అద్దంపట్టింది. సీజీలతో అద్భుతాలు చేయొచ్చని నిరూపించింది. అయితే ఈ సినిమాకి సీక్వెల్ వస్తుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతూనే ఉంది. నాని కూడా ‘పార్ట్ 2 ఎప్పుడూ..?’ అంటూ వీలైనప్పుడల్లా జక్కన్నని అడుగుతూనే ఉన్నాడు.
అయితే రాజమౌళి ఇప్పుడు పాన్ వరల్డ్ డైరెక్టర్ అయిపోయాడు. ప్రెసెంట్ అన్నీ భారీ బడ్జెట్ మూవీలే చేస్తున్నాడు. దీంతో ఈగ 2 పట్టాలెక్కడం కష్టం అనుకున్నారంతా.. కానీ రాజమౌళి మనసు మళ్లీ ఈగ 2పైకి మళ్లిందంట. ఓ స్పెషల్ టీంతో స్క్రిప్ట్ ని రెడీ చేయిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. అప్పట్లో ఈగ సైలెంట్ గా వచ్చి సూపర్ హిట్ అందుకుంది ఈసారి ఈగ మోత మాత్రం బాక్సాఫీస్ వద్ద మాములుగా ఉండదు. ప్రస్తుతానికి రాజమౌళి మహేష్ బాబుతో SSMB29 మూవీ చేసేందుకు
సిద్ధమవుతున్నాడు. ఈ మూవీ పూర్తయిన వెంటనే ఈగ 2 మొదలు పెట్టే అవకాశాలున్నాయి. SSMB 29 కంటే ముందే ఈగ 2 చేయాలి అనుకున్నప్పటికీ 1500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న మహేష్ మూవీపై మరింత ఫోకస్ పెట్టే ఉద్దేశ్యంతో ప్రస్తుతానికి ఈగను హోల్డ్ లో పెట్టినట్టు సమాచారం. ప్రెసెంట్ మహేష్ బాబు త్రివిక్రమ్ తో గుంటూరు కారం మూవీలో నటిస్తున్నాడు. ఇది అవ్వగానే రాజమౌళి సెట్ లోకి అడుగుపెడతాడు సూపర్ స్టార్.