SSMB28 : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ SSMB28 (వర్కింగ్ టైటిల్). ఇంతకు ముందు వీరి కాంబోలో అతడు, ఖలేజా వచ్చాయి. మహేష్ బాబు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. దీంతో ఈ మూవీ షూటింగ్ కి కొంత గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం త్రివిక్రమ్ మళ్లీ SSMB28 స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కుతున్న
ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు కాగా ఓ భయంకరమైన విలన్ పాత్రలో సీనియర్ హీరో జగపతిబాబు నటించనున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధకృష్ణ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్ తో సోషల్ మీడియా షేక్ అయ్యింది. అయితే ఈ నెల 31న
సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి జయంతి సందర్భంగా ఆ రోజున మూవీ నుండి ఫస్ట్ గ్లింప్స్ ని మేకర్స్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దానితో పాటే ఈ మూవీ టైటిల్ ని కూడా అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం. ఇదే నిజమైతే మహేష్ ఫ్యాన్స్ కి పూనకాలు పక్కా.. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రం మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ లా ఉండనుందని పోస్టర్ ని బట్టి అర్థమవుతుంది.