SSMB28 : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ SSMB28. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు కాగా, థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధకృష్ణ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.
ఇప్పటికే 2, 3 షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మహేష్ విదేశీ పర్యటన నుంచి వచ్చాక మళ్లీ ప్రారంభించనున్నారు. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ గ్యాప్ లో స్క్రిప్ట్ పై మరింత వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు షెడ్యూల్ల ఫుటేజీని కూడా ఆయన పరిశీలిస్తున్నట్లు సమాచారం. సమయం చిక్కినప్పుడల్లా స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తూ మరింత అందంగా సినిమాను తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇమేజ్ కి ఏమాత్రం తక్కువ కాకుండా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. దీంతో సమయం ఎక్కువగా ప్రతి షెడ్యూల్ గ్యాప్ లోనూ స్క్రిప్ట్ విషయంలో ఒకటికి రెండు సార్లు త్రివిక్రమ్ ఓవర్ లుక్ లో చెక్ చేసుకుంటూ ఉన్నాడట. ఇటీవల విడుదల చెందిన మహేష్ మాస్ ఇమేజ్ మూవీపై అంచనాలను రెట్టింపు చేశాయి.