SSMB28 Update : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ SSMB28 (వర్కింగ్ టైటిల్). ఇంతకు ముందు వీరి కాంబోలో అతడు, ఖలేజా వచ్చాయి. మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కుతున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లు కాగా ఓ భయంకరమైన విలన్ పాత్రలో సీనియర్ హీరో జగపతిబాబు నటించనున్నారు.
ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధకృష్ణ భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్ తో సోషల్ మీడియా షేక్ అయ్యింది. తాజాగా మహేష్ బాబు విదేశాల నుంచి తిరిగి రావడంతో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశారు మేకర్స్. జూన్ ఫస్ట్ వీక్ నుంచి షెడ్యూల్ కోసం హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో భారీ సెట్ ను సిద్ధం చేస్తున్నారు.
అయితే.. ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని సమాచారం. మరి అక్షయ్ కుమార్ ఏ పాత్రలో కనిపిస్తున్నాడో చూడాలి. త్రివిక్రమ్ మూవీ అంటేనే హీరోతో పాటు మరో స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటుంది. మరి అక్షయ్ కోసం మాటల మాంత్రికుడు ఎలాంటి పాత్రను సిద్ధం చేసాడో చూడాలి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.