Hero Mahesh : సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే మంచి టాలెంట్ తో పాటూ ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. లేకపోతే ఫ్లాప్, హిట్లతో సంబంధం లేకుండా కోట్లు ఖర్చు పెట్టి చిత్రాలు నిర్మించే డబ్బు బలం అయినా ఉండాలి. లేదంటే ఇప్పుడున్న పరిస్థితులలో కేవలం టాలెంట్ ని నమ్ముకుని సినిమా ఇండస్ట్రీలో మనుగడ సాగించడం కొంతమేర కష్టమని చెప్పవచ్చు. అలాగే సక్సెస్ వచ్చిన తర్వాత ఆ సక్సెస్ నిలబెట్టుకుని కొనసాగించడం కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి వచ్చీ రాగానే ఒకట్రెండు హిట్లు కొట్టి ఆ తర్వాత వరుస ఫ్లాపుల భారీన పడి కెరీన్ ని కోల్పోయి ఇండస్ట్రీ ని వదిలిపెట్టి వెళ్ళిన హీరోలు కూడా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అయితే హీరో మహేష్ కూడా ఇదే కోవాకి చెందుతాడని చెప్పవచ్చు.
Pushpa is the Third Part of the Movie : “పుష్ప” మూవీ రెండు కాదు మూడు..
షాపింగ్ మాల చిత్రం బిగ్ హిట్:
పూర్తీ వివరాల్లోకి వెళితే తెలుగు, తమిళం, మలయాళం తదితర భాషలలో మంచి హిట్ అయిన షాపింగ్ మాల్ చిత్రం ఇప్పటికీ సినీ ప్రేక్షకులకి బాగానే గుర్తుంటుంది. అయితే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు వసంత బాలన్ దర్శకత్వం వహించగా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ జీ. వి ప్రకాష్ కుమార్ సనగేతమ అందించారు. ఇక ఈ చిత్రంలో హీరో హీరోయిన్ గా తమిళ హీరో మహేష్ మరియు తెలుగమ్మాయి అంజలి నటించారు.

వరుస సినిమాలు ఫ్లాప్:
ఈ చిత్రం మంచి హిట్ అవ్వడంతో హీరో మహేష్ కి వరుస సినిమా ఆఫర్లు వరించాయి. ఈ క్రమంలో సినిమాఇండస్ట్రీకి హెరోగ్య పరిచయమైన 4 ఏళ్ల సమాయంలోనే దాదాపుగా 6 కి పైగా చిత్రాల్లో హీరోగా నటించాడు. కానీ కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో ఈ చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయి. దీంతో ఒక్కసారిగా మహేష్ సినీ కెరియర్ గ్రాఫ్ పడిపోయింది. అయినప్పటికీ అప్పుడప్పడు ఆడపాడపా చిత్రాల్లో నటిస్తూనే ఉన్నాడు. కానీ లక్ మాత్రం వరించడం లేదు.
Trisha : 4 పదుల వయసులో కూడా ఈ బ్యూటీ కి ఆఫర్లు తగ్గడం లేదుగా..
ఆఫర్లు లేక ఆర్థిక ఇబ్బందులు :
కాగా మహేష్ ఇప్పటి వరకూ డజనుకి పైగా చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ షాపింగ్ మాల చిత్రం తప్ప తన కెరీర్ లో చెప్పవకోదగ్గ హిట్లు లేవు. దీంతో ఈ మధ్య కాలంలో మహేష్ మద్యం అలవాటుకి బానిస అయ్యి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్లు తమిళ సినీ ఇండస్ట్రీలో బలంగా చర్చించుకుంటున్నారు. ఈ విషయం ఇలా ఉండగా హీరో మహేష్ చివరగా అంగారగన్ అనే చిత్రంలో కనిపించాడు. కానీ ఈ చిత్రం కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
