Tholi Prema : పవన్ కళ్యాణ్ కి యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా ఇప్పటికీ టాలీవుడ్ లో ఓపెనింగ్స్ కింగ్ ఎవరూ అంటే అందరూ పవర్ స్టార్ పేరే చెప్తారు. పవన్ కళ్యాణ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా, టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రం ‘ఖుషి’ ని ఇటీవలే రీ రిలీజ్ చేసారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోసింగ్ వరకు కలెక్షన్స్ లో ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పింది ఈ చిత్రం.
ఈ సినిమా రీ రిలీజ్ ఆ రేంజ్ సూపర్ హిట్ అవ్వడం తో పవన్ కళ్యాణ్ పాత సూపర్ హిట్ సినిమాలను మరోసారి రీ రిలీజ్ చెయ్యడానికి బయ్యర్స్ ఎగబడుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ మ్యాజికల్ హిట్ మూవీ తొలిప్రేమను 25 ఏళ్ళు కంప్లీట్ అయిన సందర్భంగా 4K రెజల్యూషన్ తో జూన్ 30న రీ రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. పవన్ కేరీర్ లోనే మాస్టర్ పీస్ గా నిలిచిన ఈ సినిమా మళ్ళీ థియేటర్స్ లోకి రానుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఈ సినిమా అప్పట్లో యూత్ కి పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ కి సైతం బాగా కనెక్ట్ అయింది. ప్రేమకథా చిత్రాల దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కించిన ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించగా, పవన్ కి చెల్లెలిగా వాసుకి కీలక పాత్ర పోషించింది. దేవా సంగీతం అందించిన ఈ సినిమా 1998లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక టాలీవుడ్ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీస్ లో ఈ సినిమా కూడా ఒకటని చెప్పొచ్చు.