మొన్న పవర్ కళ్యాణ్ పై పవర్ స్టార్ సినిమా తీసిన వర్మ ఇప్పుడు అల్లు పేరుతో సినిమా తీస్తానని ట్విట్టర్లో ప్రకటన చేసి మళ్లీ అగ్నికి ఆజ్యం పోసాడు.
పవర్ స్టార్ సినిమా విషయంలో అల్లు అరవింద్ చేసిన హెచ్చరిక ని సీరియస్ గా తీసుకున్న వర్మ ఈ సారి అల్లు అరవింద్ ని టార్గెట్ చేసాడు.
అయితే మొన్న పవన్ అభిమానుల దాడి తర్వాత వారిపై కేసు పెట్టే క్రమంలో మీరు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యడం మంచిది కాదని పోలీస్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చినట్టు తెలిసింది.
కేసులు కట్టవలసి వస్తే ఇద్దరిమీదా కట్టాలి అని వారు హెచ్చరించడంతో ఈసారి పరిస్థితి విషమించే అవకాశాలు ఉండటంతో అల్లు ప్రాజెక్ట్ ని అటక ఎక్కించేసాడని సమాచారం.