Vijay Devarakonda : సోషల్ మీడియా వచ్చిన దగ్గర్నుంచి చిన్న విషయాన్ని కూడా వైరల్ చేసి దానికి మామూలు క్రేజ్ తీసుకొచ్చి పెట్టట్లేదు మీమర్స్.. మనకు ఏదన్నా న్యూస్ తెలియాలి అంటే.. గంటలు,గంటలు ఆగాల్సిన పనిలేదు. ఒక న్యూస్ పాపులర్ కావాలన్న.. ఒక సినిమా హిట్ కావాలన్నా.. ఫట్ కావాలన్నా.. మంచైనా.. చెడైనా సోషల్ మీడియాలో కొన్ని నిమిషాలు చాలు.. చాలావరకు సినిమాలకు సంబంధించిన భవిష్యత్తు అంతా సోషల్ మీడియా పైనే ఇప్పుడు ఆధారపడి ఉందంటే అతిశయక్తి కాదు.
అయితే సోషల్ మీడియాలో ఒక విషయం ట్రెండ్ అయిందంటే మాత్రం ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. దాన్ని మనం అంచనా కూడా వేయలేము. అలా కొన్ని గంటల్లోనే ఆ న్యూస్ విపరీతంగా పాకిపోతుంది.. అయితే ఇప్పుడు అమ్మాయిలు మనసులను దోచుకునే అందగాడు.. రౌడీ బాయ్ అయినా మన విజయ్ దేవరకొండ డైలాగ్ ఒకటి విపరీతంగా ట్రెండ్ అయింది.
ఆ డైలాగ్ “ఫ్యామిలీ స్టార్” మూవీ లో విజయ్ దేవరకొండ చెప్పిన “ఐరనే వంచాలా ఏంటి ” అనే డైలాగ్. ఈ సినిమా టైటిల్ ని ప్రకటిస్తూ చేసిన గ్లింప్స్‌లో.. “ఉల్లిపాయలు కొంటే మనిషి కాదా..? పిల్లలని రెడీ చేస్తే మగాడు కాదా..? ఐరనే వంచాలా ఏంటి” అని డైలాగ్ చెప్తూ. ఐరన్ రాడ్ నీ పంచుతాడు విజయ్ దేవరకొండ.
ఎప్పుడైతే ఆ డైలాగ్ బయటకు వచ్చిందో ఇంకా అప్పటినుంచి మీమర్స్ దాన్నీ ఒక రేంజ్ లో ఆడేసుకుంటున్నారు.. దానిమీద రకరకాల మీమ్స్ తీసుకొచ్చి ఎంటర్టైన్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ డైలాగ్ చెప్పడం ఒక ఎత్తు అయితే, మీమర్స్ చేసిన మిమ్స్ వల్ల ఆ మూవీకి వస్తున్న హైప్ మాత్రం మామూలుగా లేదు.. అయితే విజయ్ దేవరకొండ చాలా క్రేజీగా ఈ డైలాగ్ కి ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలోని ఓ సన్నివేశాన్ని తీసుకొని
” ఐరనే వంచాలా ఏంటి ” డైలాగ్ మిక్స్ చేసి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. కింద ఫన్నీగా “ఇంటర్నెట్ అసలు ఏం నడుస్తుంది” అని కామెంట్ పెట్టాడు. ఇక అప్పటినుండి మొదలు ఈ డైలాగ్ ని విజయ్ దేవరకొండ మీమ్ నీ కలిపి మనోళ్లు తమ టాలెంట్ ను,క్రియేటివిటీ నీ అంతా ఉపయోగించి కొత్త, కొత్త మీమ్స్ ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు..
వాటిల్లో ముఖ్యంగా ప్రభాస్ బాహుబలి, అల్లు అర్జున్.. సరైనోడు, కలర్ ఫోటో సినిమాలో నీ డైలాగ్స్ తీసుకొని మీమ్స్ క్రియేట్ చేస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు.రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ మీమ్స్ దర్శనం ఇస్తున్నాయంటే ఇవి ఎంత వైరల్ అయ్యాయో మనం ఊహించుకోవచ్చు..అయితే ఈ మీమ్స్ మాత్రం మామూలుగా లేవు. చూస్తున్నంతసేపు నవ్వు ఆపుకోలేము.. అంతలా తమ క్రియేటివిటీని చూపిస్తూ మీమ్స్ తయారు చేసి వదులుతున్నారు మీమార్స్.
ఇక నేటిజన్స్ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు.విజయ్ దేవరకొండ, పరశురాం కాంబినేషన్ లో గీతగోవిందం తర్వాత వస్తున్న సినిమా ఇది. దీనిపైనే ఆశలు పెట్టుకొని ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పటికే లైగర్, ఖుషి సినిమాలు ఆశించినంత విజయం సాధించకపోవడంతో విజయ్ దేవరకొండ ఈ సినిమా పైనే నమ్మకం పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది..
అయితే ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నరు. ఈ సినిమాలో మృణాల ఠాగూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చూద్దాం డైలాగ్ ఎంత పవర్ఫుల్ గా ఉందో.. సినిమా కూడా అంతే పవర్ఫుల్ గా ఉండి కలెక్షన్ల వర్షం కురిపించి విజయ్ దేవరకొండకు మంచి పేరు తీసుకురావాలని ఆశిద్దాం..