Vijay Deverakonda : పాన్ ఇండియా మూవీ లైగర్ డిజాస్టర్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న విజయ్ ఇటీవల వేగం పెంచాడు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరొక సినిమా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, పూజ కార్యక్రమాలు మొదలుపెట్టడం చకచకా జరిగిపోతున్నాయి. ప్రస్తుతం విజయ్ శివనిర్వణ దర్శకత్వంలో చేస్తున్న ఖుషి మూవీ సెప్టెంబర్ 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో సమంత హీరోయిన్ కాగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

ఇక ఖుషి షూటింగ్ పూర్తవడంతో విజయ్ దేవరకొండ VD12వ మూవీ ప్రారంభించాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ తర్వాత VD13 డైరెక్టర్ పరశురాంతో చేయనున్నాడు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేస్తుండగా.. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే తాజాగా ఇంద్రగంటి విజయ్ కాంబినేషన్లో ఓ సినిమా రానున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Anushka Shetty : స్వీటీ మూవీ వాయిదా..
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తారని సమాచారం. ఈ మూవీకి ‘జటాయు’ అనే టైటిల్ ని పరిశీలిస్తోందట మూవీ యూనిట్. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ భారీగా ఉంటాయని, అలాగే ప్రీ ప్రోడక్షన్ పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలుస్తుంది. VD13 పూర్తయిన వెంటనే విజయ్ డైరెక్టర్ ఇంద్రగంటి తో మూవీ ఆరంభించాలనుకుంటున్నారట ప్రొడ్యూసర్ దిల్ రాజు.