Vijay Deverakonda : టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ కలిసి ఓ సినిమా చేస్తున్నట్టుగా 2, 3 రోజులుగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. అంతా అనుకున్నట్టుగానే వీరిద్దరి కాంబినేషన్లో VD13 తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి డైరెక్టర్ పరశురాం కాగా.. భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించనున్నాడు. గీత గోవిందం మూవీకి సూపర్ హిట్ సౌండ్ ట్రాక్ అందించిన గోపి సుందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించనున్నాడు.
ఈరోజు హైదరాబాద్ లో ఈ మూవీని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఈ చిత్రానికి క్లాప్ కొట్టగా, గోవర్ధన రావు దేవరకొండ ఫస్ట్ షాట్ ని డైరెక్ట్ చేశాడు. అలాగే సత్తి రంగయ్య కెమెరా స్విచ్ ఆన్ చేసాడు. ఇంతకు ముందు విజయ్, పరశురాం కాంబోలో వచ్చిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.
రొమాన్స్, కామెడీతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సమంత కలిసి ఖుషిలో నటిస్తున్నాడు, అలాగే గౌతమ్ తిన్ననూరితో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విజయ్. మరోవైపు మృణాల్ నేచురల్ స్టార్ నాని సరసన నాని30 లో నటిస్తుంది. విజయ్, మృణాల్ మూవీ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్ళేది ఇంకా ప్రకటించలేదు మేకర్స్.