Vijay Deverakonda : పాన్ ఇండియా మూవీ లైగర్ డిజాస్టర్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న విజయ్ ఇటీవల వేగం పెంచాడు. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరొక సినిమా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, పూజ కార్యక్రమాలు మొదలుపెట్టడం చకచకా జరిగిపోతున్నాయి. ప్రస్తుతం విజయ్ శివనిర్వణ దర్శకత్వంలో చేస్తున్న ఖుషి మూవీ చివర దశకు చేరుకుంది. ఇందులో సమంత హీరోయిన్ కాగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే సాంగ్ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
ఖుషి మూవీకి హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఖుషి పూర్తవుతుండడంతో తాజాగా VD13 డైరెక్టర్ పరశురాంతో మూవీకి పూజ కార్యక్రమం జరిగింది. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ చేస్తుండగా.. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ మూవీకి “ఫ్యామిలీ స్టార్” అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది. గోపి సుందర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించనున్నాడు. ఇదిలావుండగా విజయ్ దేవరకొండ VD12వ మూవీ ఫస్ట్ షెడ్యూల్ నిన్న మొదలయ్యింది.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ మూవీ సారథి స్టూడియోస్ లో నిన్న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అవార్డ్ విన్నింగ్ స్పోర్ట్స్ డ్రామా జెర్సీతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, రౌడీ బాయ్ ది విజయ్ దేవరకొండ,
టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల, టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. విజయ్ దేవరకొండ కొత్త పోస్టర్ ని నిన్న విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో పోలీస్ గెటప్ లో గన్ పట్టుకొని విజయ్ చాలా ఇంటెన్స్ గా కనిపిస్తున్నాడు. ఇవే కాకుండా గతంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో కూడా విజయ్ ఓ మూవీ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. పుష్ప2 తర్వాత ఈ మూవీపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.