Vijay Deverakonda : గీతగోవిందం, సర్కారు వారి పాటతో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు డైరెక్టర్ పరశురాం. ఇటీవల విజయ్ దేవరకొండతో మరో చిత్రాన్ని చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతకు ముందు విజయ్, పరశురాం కాంబోలో వచ్చిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్ ని ఫైనల్ చేయలేదు. మొన్నటి వరకు పూజ హెగ్డేని తీసుకునే ఛాన్స్ ఉంది అనుకున్నారు కానీ
చివరి నిమిషంలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మృణాల్ కొత్త డైరెక్టర్ శౌర్యవ్ తో నేచురల్ స్టార్ నానికి జోడిగా నటిస్తుంది. సీతారామం తర్వాత మృణాల్ కి ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ కథకు ప్రాధాన్యం ఉన్నా పాత్రాలనే ఎంచుకుంటుంది. ఈ క్రమంలో పరశురాం కథకు మృణాల్ అయితేనే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని భావిస్తున్నాడట. పరశురాం గత సినిమాల మాదిరిగానే ఇందులో కూడా హీరోయిన్ కి స్కోప్ ఉంటుందట.
దీంతో ఈ చిత్రంలో మృణాల్ కోసం డైరెక్టర్ బలమైన పాత్రనే చెక్కడట. రొమాన్స్, కామెడీతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. గీత గోవిందం మూవీకి సూపర్ హిట్ సౌండ్ ట్రాక్ అందించిన గోపీ సుందర్ మ్యూజిక్ అందించనున్నాడు. త్వరలో హైదరాబాద్ లో ఈ చిత్రానికి ప్రారంభోత్సవం జరగనుంది. విజయ్ ఖుషి, గౌతమ్ తిన్ననూరితో సినిమా పూర్తయ్యాక ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ళనుంది.