Virupaksha OTT : సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ (Samyuktha Menon) హీరోయిన్ కాగా ఈ మూవీకి కార్తీక్ దండు దర్శకుడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందించడం విశేషం. SVCC, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్వహించారు. సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలిచిపోయింది. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న విరూపాక్ష మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
ఈ నెల 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ అదే రోజు రిలీజ్ అవుతోన్నట్లు సమాచారం. ఈ సినిమా ఓటీటీ హక్కులను దాదాపు పది కోట్లకు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్టు తెలుస్తుంది. హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీ తెలుగులో 90 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. విరూపాక్షకు సీక్వెల్‌గా విరూపాక్ష -2 కూడా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.