Yash Bollywood Entry : యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కెజియఫ్ సినిమా ఎంటో.. దాని స్టామీనా ఎంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నార్త్ సౌత్ అంటూ తేడా లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అంతేకాదు నార్త్‌లో హిందీ సినిమాల రికార్డులను తిరగరాసింది. బాలీవుడ్‌లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. ఒక్క సినిమాతో కన్నడ నటుడు యశ్ కెరీర్ పూర్తిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు. యశ్ ఒకప్పుడు కేవలం కన్నడలోనే స్టార్ హీరో.
కానీ ఇప్పుడు పాన్ ఇండియన్ హీరోగా ఎదిగారు. ఇక KGFతో రికార్డ్స్‌ను బ్రేక్ చేసిన యశ్.. ఇటీవల KGF2 మూవీతో పలకరించిన సంగతి తెలిసిందే. యష్ హీరోగా నటించిన తన లాస్ట్ గత చిత్రాలు “కేజీయఫ్” తో సెన్సేషనల్ మార్కెట్ ఓపెన్ చేసిన యశ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అయితే ఈ గ్యాప్ లో యష్ బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందనే వార్తలు వైరల్ అయ్యాయి.
తాజాగా దీనిపై యశ్ స్పందించడం వైరల్ గా మారింది. లేటెస్ట్ గా కన్నడ మీడియా చిన్నపాటి మీడియా ఇంటరాక్షన్ లో బాలీవుడ్ ఎంట్రీ ఉంటుందా అని మీడియా వారు అడగ్గా.. యష్ మాస్ రిప్లై ఇవ్వడంతో వైరల్ గా మారింది. “నేనెక్కడికి వెళ్లను అని అందరినీ నేనున్న చోటికే రప్పిస్తా అని సమాధానం ఇచ్చాడు.” దీనితో ఈ క్రేజీ అండ్ మాస్ రిప్లై అయితే ఫ్యాన్స్ లో వైరల్ గా మారగా తాను బాలీవుడ్ లోకి వెళ్ళను అని కూడా క్లారిటీ ఇచ్చేసాడు.