BVSN Prasad Joins Janasena Party : ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో.. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ సినీ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ జనసేనలో చేరారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయనకు కండువా కప్పి పవన్ జనసేనలోకి సాదరంగా ఆహ్వానించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ (SVCC) ద్వారా తెలుగు చిత్రసీమలో అనేక విజయవంతమైన సినిమాలను అందించిన నిర్మాత భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్ (బీవీఎస్ఎన్ ప్రసాద్).
నిన్న మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ప్రసాద్ ధర్మ పరిరక్షణ నిమిత్తం పవన్ కళ్యాణ్ నిర్వహించిన యాగ క్రతువులో పాలు పంచుకున్నారు. ఆయనకు పవన్ కళ్యాణ్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. బీవీఎస్ఎన్ ప్రసాద్ సడెన్‌గా పార్టీలో చేరికపై రాజకీయంగా చర్చ జరుగుతుంది. గుంటూరు జిల్లాకు చెందిన బీవీఎస్ఎన్ ప్రసాద్.. పోటీ చేస్తారో.. లేకపోతే రాజకీయంగా పవన్‌కు మద్దతు ఇస్తారన్నది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే తనకు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చడంతో జనసేన లో చేరానని, తనకు వీలైనంతలో పార్టీకి సేవ చేస్తానని బివిఎస్ఎన్ ప్రసాద్ చెప్పారు.
అయితే గతంలో మెగాస్టార్ చిరంజీవి 2008 లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ పార్టీ తరుపున బివిఎస్ఎన్ ప్రసాద్ పోటీ చేయకపోయినప్పటికీ.. కార్యకర్తగా ఎన్నో సేవలు అందించారు. చిరంజీవి వెంట పార్టీ ఉన్నంత కాలం నడుస్తూ వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేనలో జాయిన్ అయ్యారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రసాద్ ఇటీవల ‘విరూపాక్ష’ మూవీతో 100 కోట్ల కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ తో గాండీవధారి అర్జున చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
జనసేన పార్టీలో చేరిన ప్రముఖ సినీ నిర్మాత శ్రీ బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు.#2DaysToVarahiYatra#JanaSena pic.twitter.com/cMGZVI3KkB
— JanaSena Party (@JanaSenaParty) June 12, 2023