Chandrababu Granted Bail : స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత అరెస్టై జైలుకు వెళ్లిన విషయం మనకు తెలిసిందే, ఈ కేసు గురించి ఆయనకు ఈమధ్య మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేశారు. కానీ ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఆయనకు భారీ ఊరట లభించింది అని చెప్పవచ్చు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ని మంజూరు చేసింది.
బెయిల్ మంజూరవడంతో చంద్రబాబు నాయుడు తో పాటు టిడిపి నేతలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇకపోతే స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు రిమాండ్ లో ఉన్నాడన్న సంగతి మనకు తెలిసిందే, ఆయనకు అనారోగ్య సమస్యలతో ఈ మధ్యనే మద్యంతర బెయిల్ మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని, ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దానిపై హైకోర్టు వాదనలు జరిగాయి.
చాలా సుదీర్ఘ వాదనల అనంతరం ఏపీ హైకోర్టు నవంబర్ 16న వాదనలు ముగిశాయని తెలిపింది. అయితే తీర్పును మాత్రం రిజర్వులో పెట్టింది. సోమవారం నాడు చంద్రబాబుకి బెయిల్ పై తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు. దీంతో హైకోర్టులో చంద్రబాబు నాయుడుకి రెగ్యులర్ బెయిల్ ని మంజూరు చేస్తూ ఈరోజు తీర్పును వెల్లడించారు.