Ganji Chiranjeevi : ఆప్కో చైర్మన్ గా గంజి చిరంజీవి..
చిరంజీవిని నియమిస్తూ జీవో నెం: 8ని విడుదల చేసిన ప్రభుత్వం.. గతేడాది ఆగస్టులో టీడీపీని వీడి వైసీపీలో చేరిన గంజి చిరంజీవి
వైసీపీలో చేరిన వెంటనే ఆ పార్టీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు.. తాజాగా క్యాబినెట్ హోదా కలిగిన ఆప్కో చైర్మన్ గా నియామకం..
ఇప్పటివరకు చైర్మన్ గా ఉన్న చిల్లపల్లి మోహన్ రావు పదవీ కాలం గత డిసెంబర్ తో ముగిసింది. రేపు సీఎం జగన్ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకోనున్న చిరంజీవి..
Also Read : ప్రతిపక్ష నాయకుని స్థాయి దాటలేకపోతున్న జగన్
కాగా 2014 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి తెలుగు దేశం అభ్యర్థిగా పోటీ చేసిన గంజి చిరంజీవి వైసిపి అభ్యర్థి ఆళ్ళ రామకృష్ణారెడ్డి పై 12 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.
Discussion about this post