Gudivada Amarnath : ముందు తమరికి సీట్ ఉందా..?
జగన్ తో వ్యవహారం భలే ఉంటుంది. పవన్ కళ్యాణ్ పై యుద్ధానికి ఎపుడూ తన పార్టీలోని కాపు నాయకులను వాడుతూ ఉంటాడు. వాడకం లో అదో రకం అంతే.. MLA సీట్ విషయం లో హ్యాండ్ ఇచ్చినా వాడకం లో మాత్రం తగ్గేదిలేదు అన్నట్టు ఉంది పరిస్థితి. విషయానికి వస్తే.., మంత్రి గుడివాడ అమర్నాథ్ మరో సారి జనసేన పై విమర్శలు గుప్పించారు. సవాళ్లు విసిరారు. చంద్రబాబు ఎన్ని సీట్స్ ప్రకటిస్తే పవన్ అన్ని సీట్లు ప్రకటించాలి. ఇది ఖచ్చితమైన సవాల్ అంటూ సెటైర్స్ వేశారు.
జనసేనలోకి బాలశౌరి.. వైసీపీకి భారీ షాక్..
మొన్నీ మధ్యనే జగన్ తనకు సీట్ ఇవ్వకపోవడంతో భోరున ఏడ్చిన ఈయన.. ఏడిస్తే ప్రయోజనం లేదు అనుకున్నారు ఏమో.. మళ్లీ పవన్ కళ్యాణ్ పై యధావిధిగా విమర్శలు స్టార్ట్ చేశారు. పవన్ ని తిట్టడానికి మాత్రమే మంత్రి పదవి సాధించిన ఈయన తన హయాంలో ఒక్క IT కంపెనీ తెచ్చింది లేదు. పైగా కోడి గుడ్డు పొదగలేదు అని కామెడీ అయిపోయారు. జగన్ “నీకు గెలిచేంత సీన్ లేదు..” అని పక్కన పెడితే.. వెక్కి వెక్కి ఏడ్చి ఇప్పుడు మళ్లీ తుడిచేసుకునే పవన్ ని విమర్శించడానికి బయలు దేరాడు అంటూ జనసైనికులు సెటైర్స్ విసురుతున్నారు.
మేం ఎన్ని పోటీ చేస్తామో.. ఎపుడు సీట్లు ఎనౌన్స్ చేస్తామో మాకు తెలుసు గానీ.. ముందు నీకు దమ్ముంటే జగన్ దగ్గర నీ సీట్ నువ్ తెచ్చుకో.. ఇదీ అసలైన సవాల్.. జగన్ ని వెళ్లి అడగగలవా..? అంటూ ప్రశ్నిస్తున్నారు..