Janasena : కేంద్ర మంత్రి ప్రకటన..జనసేన విజయం..
“వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై ప్రస్తుతం ముందుకు వెళ్ళడం లేదు. ముందు RINL ను బలోపేతం చేస్తాం” అంటూ ఈరోజు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ చేసిన ప్రకటనతో గత కొద్ది రోజులుగా ఏపీ, తెలంగాణ అధికార పార్టీ నేతలు చేస్తున్న వాదోపవాదాలకు తెర దించినట్టయింది. కేంద్ర మంత్రి చేసిన ప్రకటనను కొంతమంది తమ విజయం అన్నట్టు డప్పు కొట్టుకుంటున్నారు గానీ…
వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం మీద ఒక విధాన పరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు… వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని మినహాయించండి అంటూ ఆనాడు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కలిసి చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ పెద్దలు అంగీకరించారు.
ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, ఒకవేళ అలాకాదని వైజాగ్ స్టీల్ ప్లాంట్ నీ ప్రైవేటు వారి చేతుల్లో పెడితే ప్రజా ఉద్యమం చేపడతామని పవన్ కళ్యాణ్ గారు ఆనాడే కేంద్ర పెద్దలకు స్పష్టం చేయడంతో కేంద్రం దిగి రాక తప్పలేదు. దాని పర్యవసానమే ఈరోజు కేంద్ర మంత్రి గారి ప్రకటన. ఇది ఖశ్చితంగా రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ సాధించిన విజయం.
– కూసంపూడి శ్రీనివాస్