JD Lakshmi Narayana About KCR : సీబీఐ మాజీ జేడీ వీ వీ లక్ష్మీ నారాయణ ప్రస్తుతం BRS జపం చేస్తున్నారు. కేసీఆర్ భజన మొదలుపెట్టారు. పర్సనల్ గా ఆయన ఎవరి గానం చేసినా ఎవరికీ ఏ ఇబ్బందీ లేదు.. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన కేసీఆర్ వల్లనే కేంద్రం వెనక్కి తగ్గింది అన్నట్లు మాట్లాడడం మాత్రం అది దిగజారుడు తనమే అనుకోవాలి.
అసలు విశాఖ ఉక్కు కోసం BRS చేసింది ఏముంది..? రెండేళ్లుగా విశాఖ ఉక్కు ఉద్యమం జరుగుతుంటే కనీసం ఒక్కసారైనా మద్దతుగా మాట్లాడిందా..? కేసీఆర్ ఏమైనా వైజాగ్ కి వచ్చి పోరాడారా..? అసలు ఇన్నాళ్లుగా ఆయన చేసింది ఏముంది..? ఇపుడు చివరిలో ఇలా వచ్చింది కూడా రాజకీయ లబ్ది కోసమే తప్ప ఆంద్రప్రదేశ్ బాగు కోసం కాదు అని జేడీ కి తెలీదా..?
ఒకవేళ BRS అనేది లేకుంటే కేసీఆర్ ఇటు వైపు చూస్తాడా..? ఇవన్నీ జేడీ లక్ష్మీ నారాయణకు తెలియనివి కావు. కానీ ఇలా మాట్లాడడం వెనుక ఆయన రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి అనేది వినబడుతున్న మాట. త్వరలో ఆయన BRS లో చేరడానికే ఇలా కేసీఆర్ భజన చేస్తున్నారు అనే గుసగుసలు వినబడుతున్నాయి.