Pawan Kalyan On Instagram : పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడూ అభిమానులకు, ప్రజలకు అందుబాటులో ఉండాలని భావిస్తారు. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే.. రాజకీయాలలో ప్రజల వద్దకు వెళ్లేందుకు వారాహి విజయ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇటీవల వారాహి విజయయాత్రలో జ్వరంతో అనారోగ్యంతో ఉన్నప్పటికీ బ్రో సినిమాకు సంబంధించి టీజర్ డబ్బింగ్ పూర్తి చేసిన విషయం తెలిసిందే.
ఇంత బిజీగా ఉండే పవన్ కళ్యాణ్ ప్రజలతో నేరుగా టచ్ లో ఉండటానికి సోషల్ మీడియాను ఆయుధంగా ఉపయోగించుకుంటున్నారు. పవన్ తన సోషల్ మీడియాలో కేవలం రాజకీయాలకు సంబంధించిన విషయాలను మాత్రమే సోషల్ మీడియాలో పంచుకుంటారు. ట్విట్టర్లో పవన్‌కు 5.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా పవన్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
పవన్ అలా అకౌంట్ ఓపెన్ చేశాడో లేదో లక్షల్లో ఫాలోవర్స్ వచ్చి చేరుతున్నారు. అభిమానులకు, కార్యకర్తలకు నిత్యం టచ్‌లో ఉండాలనే ఉద్దేశ్యంతో ఇన్‌స్టాలో అడుగు పెట్టిన పవన్ ఫస్ట్ పోస్ట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రెసెంట్ పవన్ చేతిలో ఇప్పుడు 4 సినిమాలుండగా.. పవన్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://instagram.com/pawankalyan?igshid=MzRlODBiNWFlZA==