Pawan Kalyan : వారాహి విజయయాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలను తెలుసుకోవడం, ప్రభుత్వ పనితీరును నిగ్గుతేల్చడంలో చాలా బిజీ అయిపోయారు. ప్రజల ప్రతి ఒక్క సమస్యను, ప్రభుత్వం పనితీరును చాలా వివరంగా ప్రజల కళ్ళ ముందు ఉంచుతున్నారు. దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ నిరుద్యోగుల గురించి, ప్రభుత్వ అసమర్ధ పాలన గురించి, ప్రభుత్వం సంక్షేమ పథకాలనీ
చెప్పి తమ పబ్బం గడుపుకుంటున్న తీరును గురించి ఆయన గళం విప్పారు. జనసేన షణ్ముఖ వ్యూహం ద్వారా టాలెంట్ ఉండి, ఉపాధి కల్పించే ప్రణాళిక ఉండి, పెట్టుబడి లేక ఇబ్బందులు పడే యువతకు ప్రతీ నియోజకవర్గం నుండి 500 మంది యువతకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ క్రింద 10లక్షలు ఇస్తాము, వారిని వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు గా తీర్చిదిద్దుతాం అని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఆదాయ వనరులు క్రియేట్ చేయకుండా, అప్పులు చేసి సంక్షేమం అంటాడు ఈ జగన్ రెడ్డి, పాలన చేతకాక పాపం పసివాడిని, నేను అమాయకుడిని, అందరూ కలిసి నాకు వ్యతిరేకంగా వస్తున్నారు అంటారు. నవరత్నాలు అని చెప్పి మాయ చేశారు. మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు మద్యం నుండి 25 వేల కోట్లు ఆదాయం సంపాదిస్తున్నారు, ఇదేనా నవరత్నాలు అనీ ఆయన ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు.
వారాహి విజయ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గ అంశాలు, పరిస్థితులు, సమస్యలుపై స్థానికంగా ఉన్న ప్రముఖులు, విద్యావేత్తలు, వ్యాపారులు, లాయర్లు, డాక్టర్లు, ఇతర రంగాల పెద్దలతో గురువారం ఉదయం గొల్లప్రోలులో సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో జనసేన భవిష్యత్తు ప్రణాళిక గురించి, స్థానిక అంశాల గురించి, సమస్యల గురించి వారితో పవన్ కళ్యాణ్ మాట్లాడారు.