Pawan Kalyan : జనసేన ని చేపట్టిన వారాహి యాత్రలో భాగంగా ఆయన పిఠాపురం నియోజకవర్గం వీర మహిళలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎన్నో అంశాలను ఆయన వీర మహిళలతో మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో జనసేన వీర మహిళల తెగువ ప్రశంసనీయం అని పవన్ కళ్యాణ్ వీర మహిళల ధైర్యాన్ని కొనియాడారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుండి పార్టీని నడిపించిన వీర మహిళల వివరాలను, వారి రాజకీయ ఆకాంక్షలను అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీకి వీర మహిళల బలం విలువైనది. ఎన్నికల్లో ఓటమి, గెలుపు అనేది కాదు. పోరాటం ముఖ్యం. ప్రజల తరపున గళమెత్తడమే ప్రధానం. ఓటమి నుంచి వచ్చే గెలుపు స్పూర్తి పాఠాలు నింపుతుంది. చేసిన గొప్ప ప్రయత్నం ఎప్పుడు వృథా కాదు. గొప్ప ఆశయ సాధన కోసం మీరు ముందుకు నడిచారు అన్నదే ప్రధానం.
జనసేన పార్టీ మధ్యతరగతి పార్టీ, సాధారణ యువత, మహిళలు మన పార్టీకి ప్రధాన ఆస్తి. జనసేన పార్టీ ఆశయాలు, విధానాలు మధ్యతరగతి వారికి అనుగుణంగా ఉంటాయి అని ఆయన వెల్లడించారు..ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, రామేశ్వరం పంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన గెలిచిన కె.సూర్యకుమారి మాట్లాడుతూ..స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన
జెండా పట్టుకున్నానని, వార్డు మెంబర్ గా పోటీలో ఉన్నానని మా ఇంటికి రెండు సార్లు వైసీపీ గుండాలు వచ్చి, దళిత మహిళనని చూడకుండా నా మీద దాడి చేశారు. పోటీ నుంచి పక్కకు తప్పుకోవాలని లేకుంటే నా ఒక్కగానొక్క కొడుకును చంపిస్తామని బెదిరించారు. నాపైనే దాడులు చేసి పోలీసు కేసులతో వేధించారు., నేనెక్కడా బెదరలేదు. పోటీ నుంచి వెనకడుగు వేయలేదు.
చివరకు 45 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి మీద వార్డు మెంబర్ గా గెలిచాను అని ఆమె స్పష్టం చేశారు..ఇది కేవలం ఒక్క సూర్యకుమారి విజయమే కాదు.ఇలాంటి తెగువ చూపి, జనసేన పార్టీకి ప్రతికూల పరిస్థితుల్లో సైతం అండగా నిలిచిన వీరనారూలెందరో, ఇంకెందరో ఉన్నారు. నేను గతంలో చెప్పినట్టుగానే వారందరినీ విడతల వారీగా కలుస్తానన్నాను జనసేన వారాహి యాత్రలో ఈ విధంగా మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు.