Pawan Kalyan : ఒక మనిషి సంకల్పం చాలా గొప్పది. ఏదైనా సాధించాలనే పట్టుదలతో ముందడుగు వేస్తే విజయం తప్పక వరిస్తుంది అనడంలో సందేహం లేదు.. విజయం ఊరికే రాదు శ్రమతో కూడుకొని ఉంటుంది. ఎన్ని అడ్డంకులు, అవరోధాలు వచ్చినప్పటికీ వాటిని అధిగమిస్తూ మార్గాన్ని సుగమం చేసుకుంటూ ముందుకు వెళితే సాధించలేనిది ఏదీ లేదు. సంకల్ప సాధన దిశగా అడుగులు వేసిన ఎంతోమంది విజయగాథలు మనం వినే ఉంటాం.
ఈరోజు పవన్ కళ్యాణ్ ది కూడా అటువంటి గొప్ప సంకల్పమే. ఎందుకంటే ఆయన ఒక రాజకీయవేత్తగా మాత్రమే ఉండాలని అనుకోలేదు. రాజకీయనాయకుడికి అసలైన అర్ధాన్ని, నిర్వచనాన్ని తోటి రాజకీయ నాయకులకు, ప్రజలకు అర్థం చేసే దిశగా తన పయనాన్ని సాగిస్తున్నారు.
చేగువేరా లాంటి విప్లవ నాయకుని వారసత్వాన్ని పునికి పుచ్చుకొని, పీడిత వర్గాల స్వేచ్ఛ, సమానత్వాల కోసం కొట్లాడే నాయకుడిగా ముందు వరసలో ఉంటూ, రాజకీయం అంటే కులకంపు కాదు, ప్రజాస్వామ్య సమాజం అని నలుదిక్కులా చాటి చెపుతూ..ఒక మనిషిని మనిషిగా మాత్రమే గుర్తించే సమసమాజం కోసం పోరాటం చేసే ఒకదీరుడిగా ఆయన మన ముందు నిలువెత్తు నిదర్శనంగా ఈరోజు నిలిచారు.
ఇవి ఉత్తి మాటలు కాదు.. ఎందుకంటే ఆయన మొదలుపెట్టిన ప్రజాయాత్ర ఏ విధంగా ముందుకు సాగిందో అందరం గమనిస్తూనే ఉన్నాం. అడుగడుగునా నీరాజనం, హర్షద్వానాలు,ఆనంద ఉత్సహాలే కాదు, ఒక్కో హృదయాన్ని కదిలిస్తే మనసు చెదిరిపోయే కన్నీటి గాథలు, అన్యాయానికి, అక్రమానికి అధికార ప్రభుత్వం చేతిలో నలిగిపోతున్న బతుకుల ముఖచిత్రాలు, మనకు తెలియని ఎన్నో అఘాయిత్యాలను, ఆవేదనలను పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయయాత్ర మన కళ్లకు కట్టినట్లుగా ప్రత్యక్షంగా చూపించింది.
రాజకీయం, రాజకీయనాయకుడు అంటే కేవలం అక్రమస్తులను కూడగట్టుకోవడం, ప్రజల కష్టార్జితాన్ని దోచుకోవడం ఇప్పటివరకు రాజకీయ నాయకుడికి ఉన్న గుర్తింపు, వాస్తవం కూడా ఇదే. కానీ ప్రజలకు వెన్నంటి ఉండే నాయకుడు ప్రజా నిర్ణయానికి మొదటి పీట వేసి, ఆ నిర్ణయాన్నే తన నిర్ణయంగా పరిగణించి అధికారం ఎవడి సొత్తు కాదు అనీ నిగ్గు తేల్చే దిశగా పవన్ అడుగులు సాగుతున్నాయి..సాగడమే కాదు..అతని వెనుక ఎన్నో అడుగులను సాగేలా చేస్తున్నాయి.
రాజకీయంలో మాటలతో బురిడీ కొట్టించే నాయకులు కోకొల్లలు. అలాంటి నాయకుల బండారాన్ని బయటపెట్టే అసలు సిసలైన నాయకుడు పవన్ కళ్యాణ్ రూపంలో ఈరోజు ప్రజలకు దొరికాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే..ఒక నియోజకవర్గంలోకి పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు అంటేనే, అధికార ప్రభుత్వం అప్రమత్తమై అప్పటివరకు పెండింగ్ లో పెట్టిన పనులను చక్కబెడుతుంది అంటేనే, ఒక నాయకుడిగా పవన్ కళ్యాణ్ గెలిచినట్టే లెక్క.
వెండితెరపై ఆయన నటనతో ఇన్నాళ్లు మన హృదయాలను దోచుకోనీ హీరోగా నిలిచాడు, కానీ ఈరోజు రాజకీయాల్లో ప్రవేశించి తన,మన భేదం లేకుండా అందరి బాధలు తెలుసుకొని,అందరిని కలుపుకొని, కష్టం ఉన్న చోట పవన్ అన్నలా ప్రత్యక్షమై అందరి హృదయాలు గెలిచి రియల్ హీరో అయ్యాడు. అధికార పక్షంలో ఉన్న పార్టీ, ప్రతిపక్ష నాయకుల పై ఎంతటి బురద జల్లడానికైనా వెనుకడుగు వేయదు..
మన అధికార పార్టీ కూడా ఆ విధంగానే శృతిమించి పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తూ ప్రతి చోట ఆయన యాత్రను అడ్డుకునే ప్రయత్నాలు చేసింది. కానీ ఎక్కడా కూడా జంకకుండా, వెనకడుగు వేయకుండా పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ముందుకు వెళుతూనే ఉన్నారు. ఆ దిశగానే తూర్పుగోదావరి జిల్లాలో చేపట్టిన యాత్ర విజయవంతమై ఇప్పుడు ఏలూరు నుండి రెండో దశ ప్రారంభం కాబోతుంది. మొదటి దశ యాత్రతో పవన్ కళ్యాణ్ ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసేశారు.
వయసు తో సంబంధం లేకుండా అందరి మన్ననలు పొందాడు. పవన్ కళ్యాణ్ అంటే ఒక హీరో అనే దిశగా ప్రజలు ఆయనను ఆదరించలేదు. తమ సమస్యలు తీర్చే నాయకుడు గానే చూసారు. ఇక రెండో దశ యాత్ర ఎలా ఉండబోతోందో ఊహించవచ్చు. అధికార ప్రభుత్వ వలయంలో చిక్కుకున్న జన సమూహాలే అధికం. ప్రతి ఒక్కరు అవకాశం కోసం ఎదురుచూస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ఒక్క అడుగు ఎందరి జీవితాలలో ఆశాజ్యోతి వెలిగిస్తుందో మనం ఊహించుకోవచ్చు.
వెలుగునింపే సూర్యుడి కోసం..ఎదురు చూస్తున్న ఆశాజీవులు ఎన్నో..వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉన్నా.. ప్రజల మనసు గెలిచిన వాడే నిజమైన నాయకుడు.. పవన్ కళ్యాణ్ అది ఎప్పుడో దాటేశాడు.. ప్రజలను చూడగానే ఆయన మొహంలో చిరునవ్వు, రెండు చేతులా అభివాదం.. వాటికి అనుగుణంగా ప్రజల నుండి వచ్చే స్పందన.. ఇవీ పవన్ కళ్యాణ్ ప్రజా నాయకుడు అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనాలు.