Pawan Kalyan : రానున్న 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ బలమైన ముద్ర వేస్తుందనే నమ్మకాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తం చేశారు. తొలి విడత వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసిన పవన్ కళ్యాణ్.. రెండోవిడత యాత్రలో మరింత దూకుడుగానే వ్యహరించారు. ఈసారి ప్రభుత్వంపై విమర్శలు సకారత్మకంగా చేసి పాలక పక్షాన్ని ఇరుకున పెట్టారు. వ్యవస్దలోని లోపాలపైదృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ క్రమంలోనే ఆయన వాలంటీర్ల వ్యవస్థపై విమర్శలు చేశారు. వ్యవస్దపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.

ప్రశ్నించిన తీరులో కాస్త ఆక్షేపణ వున్నా నిజాన్ని వ్యవస్థలోని లోపాలను తేటతెల్లం చేయటం వల్ల పవన్ కల్యాణ్ పై కేసుల పరంపరతో ప్రక్కదారి పట్టించే పనిలో ఆధికార పార్టీ మంది మాగధులు నిమగ్నమైనారు. ప్రభుత్వం దారి మళ్ళిస్తున్న నిధుల గూర్చి ప్రశ్నించడం కాగ్ నివేదిక వివరాలతో సహా నిలదీయటం లాంటి వాటిని పరిశీలిస్తే ఈ సారి జనసేనాని బాగానే కసరత్తు చేసినట్లు అవగతమౌతోంది. వారాహి యాత్ర కోసం చేసిన కృషి, పడిన కష్టం వృథా కాబోదని ఆయన అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బలమైన ముద్ర వేస్తుందని చెప్పడం గమనార్హం. తొలి దశ వారాహి యాత్ర ఉభయ గోదావరి జిల్లాల కేంద్రంగా జరిగిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే చేసిన వ్యాఖ్యలు.. ప్రజాకంటక పాలన విముక్తి గోదావరి జిల్లా నుంచే ప్రారంభం అవుతుందని సంకేతాన్ని జనసైనికులకు ఇచ్చి క్యాదర్ లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. ఇదే పట్టుదలతో సక్సెస్ఫుల్ చేయాలని కోరారు. జనసేన ఎంత బలంగా ముందుకు వెళ్లితే రాష్ట్రానికి అంత మేలు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పొత్తులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పోటీ ఒంటరిగానా? పొత్తులోనా అనేది తేలడానికి చాలా సమయం ఉందని, పొత్తులు ఉంటాయో ఉండవో తేలే వరకు పార్టీలో ఎవరూ దాని గురించి మాట్లాడ వద్దని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే పొత్తు లేదా ఒంటరి పోటీ నా అన్న ప్రశ్నను ఉత్పన్నం అయ్యేటట్లు చేస్తోంది. పొత్తులపై ఇంకా సంధిగ్ధత కొనసాగుతోంది.

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అని అవివేకంతో మాట్లాడటం లేదని, అధికారంలోకి రావాలనే ఆశ ఎవరికి ఉండదు? అందరికి ఉంటుందని అని చెప్పడం చూస్తే పవన్ కల్యాణ్ పదునైన అలోచనలతో కొత్త వ్యూహాన్ని రచిస్తున్నట్లు తెలుస్తోంది. లేదని ఈసారి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని ఓటుగా మలచుకొని క్రియాశీలక రాజకీయ నాయకుడిగా తనని తాను మార్చుకుంటునట్లు సంకేతం సుస్పష్టం ఇప్పటికే ‘హలో ఏపీ.. బైబై వైసీపీ’ అంటూ నినదించడం షురూ చేసిన పవన్ కళ్యాణ్, ఆ నినాదానికి కొనసాగింపుగా ‘వెల్కమ్ జేఎస్పీ’ అంటూ నినదించడం గమనార్హం. వైసీపీకి గుడ్ బై చెప్పేసి.. జనసేన పార్టీకి వెల్కమ్ చెప్పాలన్నది జనసేన అధినేత, రాష్ట్ర ప్రజలకు సూచిస్తున్న విషయం.