Pawan Kalyan Vaarahi Yatra : ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో తీరిక లేని షెడ్యూల్ గడుపుతున్నాడు. ఎప్పుడు షూటింగ్ లో ఉంటాడో, ఎప్పుడు సభలు, సమావేశాల్లో ఉంటాడో తెలీదు. మొన్నటి వరకు సముద్రఖని బ్రో ది అవతార్ లో బిజీగా ఉన్న పవన్ సడన్ గా హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లో దర్శనమిచ్చాడు. ఆ తర్వాత వెంటనే సుజీత్ ఓజీ మూవీ కోసం ముంబై వెళ్ళాడు.
ఇలా వరుస షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు అనుకుంటుండగానే.. తాజాగా జనసేన వారాహి యాత్రకు సిద్ధమయ్యాడు జనసేనాని. అయితే ఈ యాత్రకు ముందుగా పవన్ చేసిన యాగానికి ఆయనతో చిత్రాలు చేస్తున్న ప్రొడ్యూసర్స్ కూడా హాజరు కావడం ఆసక్తిగా మారింది. పైగా పవన్ యాత్ర మద్దతుగా సోషల్ మీడియా వేదికగా డివివి ఎంటర్టైన్మెంట్స్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ బెస్ట్ విషెస్ చెప్పడం గమనార్హం. దీంతో ఇది ఫ్యాన్స్ తో పాటు, ఫిల్మ్ సర్కిల్ లో
ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. భవిష్యత్తులో పవన్ కు ఇతర నటీనటులు, డైరెక్టర్స్ కూడా మద్దతు తెలిపే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చూడాలి మున్ముందు ఏం జరుగుతుందో.. ఏదేమైనా పవన్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు. వచ్చే నెలలో పవన్ బ్రో ది అవతార్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉండడంతో పాటు వచ్చే ఏడాది ఏపీ ఎలక్షన్స్ పై పవన్ మార్క్ గట్టిగా ఉండే ఛాన్స్ ఉందని అంతా భావిస్తున్నారు.
https://twitter.com/MythriOfficial/status/1668323440384954368?t=vdn-GQk4imRyYRZLhU37tA&s=19
https://twitter.com/DVVMovies/status/1668281391719538688?t=upgNumH5TqNQ2lE07e97LQ&s=19