Shiva Temple : ఈ భూమి మీద శివాలయాలకు కొదవలేదు. ఆ శివుని ఆరాధించుకోవడానికి ఎన్నో ఆలయాలు వెలిసాయి. దాంట్లో చాలా ప్రాముఖ్యత కలిగినవి కూడా ఉన్నాయి. శివుని ఆరాధించుకోవడం కోసం భక్తులు ఎంత దూరమైనా వెళ్లడానికి సాహసం చేస్తూనే ఉంటారు. అలాంటి ఎంతో విశిష్టత కలిగి ఉన్న ఆలయం ఎక్కడ ఉందో.. ఆ ఆలయం యొక్క విశిష్టత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అరేబియా తీరాన కొలియాక్ గ్రామంలో సముద్రంలో శివాలయం ఉంది. అవును మీరు వింటున్నది నిజమే.. ఆ పరమశివుడు ఆ సముద్ర గర్భాన వెలిశాడు. ఈ ఆలయం భావ్ నగర్ కు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం చూడడానికి కాస్త భయానకంగా ఉన్నప్పటికీ.. సముద్ర గర్భంలో ఉండే ఆ పరమేశ్వరుడుని దర్శించుకుంటే తాము చేసినటువంటి సకల పాపాలు తొలగిపోతాయని,
ఏవైనా దోషాలు ఉంటే సమసిపోతాయని భక్తులు సాహసోపేతంగా ఆ శివుని దర్శించుకోవడానికి వెళుతుంటారు. ఇక్కడ శివుడిని నిష్కలంక్ మహాదేవ్ అని పిలుస్తారు. ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకోవాలంటే సమయ, సందర్భాలు ఉంటాయి. ఎప్పుడు పడితే అప్పుడు ఆ శివుని దర్శనం ఇక్కడ కుదరదు. ఉదయం సముద్రం పెద్ద ఎత్తున అలలు రావడంతో ఈ ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోయి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో ఆ శివదర్శనం కష్టతరం.
ప్రతిరోజు 10 గంటల సమయంలో సముద్రంలోని అలలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. ఆ సమయంలో జెండాతో ఒక స్థూపం 5 శివలింగాలు దర్శనమిస్తాయి. అప్పుడు భక్తులు ఈ ఆలయంలో దర్శనం కోసం వెళ్లవచ్చు. అమావాస్య ,పౌర్ణమి రోజుల్లో భక్తులు ఇక్కడ అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మహాశివరాత్రి పర్వదినాన భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడమే కాక.. ఆ బోలాశంకరుడికి ఆ సమయాన పెద్ద ఎత్తున ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు.
ఈ ఆలయం దగ్గరకు ఎక్కువగా ఇంట్లో పెద్దలు మరణిస్తే వారి అస్థికలను సముద్ర గర్భంలో కలపడానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు వెళుతూ ఉంటారు. అలా చేయడం వల్ల ఆ పరమశివుని మోక్షం చనిపోయిన వారికి లభిస్తుందని వారి ఆత్మకు శాంతి చేకూతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మధ్యాహ్నం సమయంలో సముద్రం కొంత భాగం వెనక్కి వెళ్లడం జరుగుతుంది. అలా వెళ్ళినప్పుడు ఆలయానికి భక్తులు చేరుకొని విశిష్టంగా పూజలు నిర్వహిస్తారు.
ఇక్కడ నమ్మశక్యం కాని విషయం ఏమిటంటే ఎంతో విశేష, విశిష్టత కలిగిన ఈ ఆలయం సముద్ర గర్భంలో ఎలా నిర్మించారు.. ఇప్పటికి ఆలయం చెక్కుచెదరకుండా సముద్ర గర్భంలో ఎలా ఉన్నది మానవ మాత్రులకు అంత చక్కని ప్రశ్న. ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కూడా ఈ ప్రశ్నకు సమాధానాన్ని కనిపెట్టలేకపోవడం ఇక్కడ గమనార్హం.